వాతావరణం | Sakshi
Sakshi News home page

వాతావరణం

Published Wed, May 8 2024 11:55 PM

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ వేడి స్వల్పంగా తగ్గుతుంది. సాయంత్రం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

జోరుగా హోం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

ఆసిఫాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు హోం ఓటింగ్‌ను వినియోగించుకుంటున్నారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో 127 మంది హోం ఓటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా బుధవారం నాటికి 122 మంది వినియోగించుకున్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 29 మందికి 29 మంది ఓటు వేశారు. అలాగే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ గడువు బుధవారంతో ముగిసినప్పటికీ ఈ నెల 10 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే తెలిపారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం 2,420 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 2,039 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. సిర్పూర్‌ నియోజకవర్గంలో 1,415 మంది దరఖాస్తు చేసుకోగా 1,246 మంది ఓటు వేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

జాతీయ చేనేత అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్‌అర్బన్‌: జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద సంత్‌ కబీర్‌ జాతీయ చేనేత అవార్డు కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి దుస్తుల ఎగుమతి శాఖ సంచాలకులు అలుగు వర్షిణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత డిజైన్‌ డెవలప్‌మెంట్‌, ఎన్‌హెచ్‌డీపీ కింద చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ రంగంలో గుర్తింపు కోసం కార్మికులు, డిజైనర్లు, విక్రయదారుల నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నేత విభాగంలో మూడంచెల ఎంపిక ప్రక్రియ(జోనల్‌, హెడ్‌క్వార్టర్‌, జాతీయ స్థాయి ఎంపిక కమిటీ) ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ, మార్గదర్శకాలు, ఇతర వివరాల కోసం https://handlooms. nic.in ను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా హైదరాబాద్‌లోని వీ వర్‌ సర్వీస్‌ సెంటర్‌లో సమర్పించాలని కోరారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement