పేరు భైరవ  | Sakshi
Sakshi News home page

పేరు భైరవ

Published Sat, Mar 9 2024 3:45 AM

Kalki AD 2898: Prabhas to play his role as Bhairava - Sakshi

మహా శివరాత్రి కానుకగా ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర యూనిట్‌. ఈ చిత్రంలో ప్రభాస్‌పాత్ర పేరు భైరవి అని పేర్కొని, ఆయన లేటెస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలకపాత్ర ధారులు.

వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహా శివరాత్రి సందర్భంగా భైరవపాత్రని పరిచయం చేసి, కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా ‘కల్కి 2898 ఏడీ’ రూపొందుతోంది. మహాభారత పురాణ ఘటనల నుండి మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథ ఇది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ చిత్రకథ నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అక్కడి అందమైన ప్రదేశాల్లో ప్రభాస్, దిశా పటానీలపై ఒకపాటను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్‌.

Advertisement
Advertisement