కంగనా రనౌత్‌ పుట్టినరోజు.. ఈ బ్యూటీ తల్లి గురించి తెలుసా? | Bollwood Actress Kangana Ranaut Birthday Special Story, Know Rare Interesting And Unknown Facts About Her In Telugu - Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్‌ పుట్టినరోజు.. ఈ బ్యూటీ అమ్మ గురించి తెలుసా?

Published Sat, Mar 23 2024 2:43 PM

Kangana Ranaut Birthday Special Story - Sakshi

రాజకీయాల నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు అంశం ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ కంగనా రనౌత్‌. అటు సినిమాలతో పాటు.. ఇటు రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అందుకే కంగనా అంటే కాంట్రవర్సీ క్వీన్‌ అని కూడా పిలుస్తారు. తన మాటలు కాంట్రవర్సీ అయినా కూడా.. ధైర్యంగా ఎదుర్కొగల సత్తా ఆమెది. మార్చి 23న కంగనా రనౌత్ బర్త్‌ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మార్చి 23 1987లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని  భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు కంగనా రనౌత్.. అదే గ్రామంలో కంగనా అమ్మగారు ఇప్పటికీ కూడా పొలంలో పని చేస్తుంటారు. రోజుకు 8గంటల పాటు పొలంపనిలోనే ఆమె ఉంటారట. 25 ఏళ్లకుపైగా టీచర్‌గా పని చేసిన ఆమె తన కూతురు మిలీనియర్‌ అయినా కూడా పల్లెటూరులోనే జీవిస్తున్నారు. ముంబై వంటి నగరాలు అమ్మకు నచ్చవని అందుకే ఆమె సింప్లిసిటీ జీవితాన్ని గడుపుతుందని గతంలో కంగనా తెలిపారు.  ఆమె  తల్లిదండ్రుల కోరికతో డాక్టర్ అవ్వాలనుకున్న కంగనా.. తన 16వ ఏటనే కెరీర్ కోసమని ఢిల్లీలో అడుగు పెట్టి ఆపై  మోడలింగ్‌ వైపు అడుగులు వేశారు.

2006లో గ్యాంగ్‌ స్టర్ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్‌.. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకుంది. ఆపై ఆమె అనేక సినిమాలతో బాలీవుడ్‌లో తన సత్తా ఎంటో చూపించింది. ఆమెకు ఇప్పటివరకూ మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు దక్కాయి. హృతిక్ సరసన ఆమె నటించిన క్రిష్- 3 సినిమా ఆమె కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో  ఒకటిగా నిలిచింది.

ఇవాళ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ వీడియో ద్వారా తన చిన్ననాటి ఫోటోలను కూడా షేర్‌ చేశారు. ఇవాళ ఆమె 37వ బర్త్‌ డే జరుపుకుంటున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన కంగనా.. కాంగ్రాలోని బగ్లాముఖి మాత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆపై ఆమె ఫోటోలతో ఉన్న పలు కేక్స్‌ను కూడ కట్‌ చేశారు. ఆమె అభిమానులు భారీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తున్నారు. దీనితో పాటు 'తను వెడ్స్‌ మను పార్ట్‌ 3' చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు.

Advertisement
Advertisement