నాని 'సరిపోదా శనివారం' గ్లింప్స్‌ విడుదల.. టైటిల్‌ సీక్రెట్‌ ఇదే | Nani Saripodhaa Sanivaaram Movie Glimpse Video Out Now, Trending On Social Media - Sakshi
Sakshi News home page

నాని 'సరిపోదా శనివారం' గ్లింప్స్‌ విడుదల.. టైటిల్‌ సీక్రెట్‌ ఇదే

Published Sat, Feb 24 2024 1:14 PM

Nani Saripodhaa Sanivaaram Movie Glimpse Out Now - Sakshi

నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. 'అంటే సుందరానికీ' సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో  ఈ సినిమా తెరకెక్కుతుంది.  ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య ఓ కీలక పాత్రలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాడు. ఆగష్టు 29న  ఈ చిత్రం విడుదల కానుంది.

నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌.. ఇందులో నాని యాంగ్రీమెన్‌లా కనిపిస్తున్నాడు. ఎస్‌ జే సూర్య వాయిస్‌తో గ్లింప్స్‌ ప్రారంభం అవుతుంది. వారం మొత్తంలో శనివారం మాత్రమే హీరో నానిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. దీనినే ఈ గ్లింప్స్‌లో చూపించారు.

వారంలో అన్ని రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా ఈ మూవీ ఉండనుంది. యాక్షన్‌కు.. వినోదానికి ఇందులో పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. నాని క్యారెక్టర్ డిజైన్ చాలా ఫ్రెష్ గా ఉంది. గ్లింప్స్‌లో డైలాగ్స్ లేకపోయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. నాని సిగరెట్ తాగే విధానం పాత్రకు చైతన్యాన్ని తెస్తుంది.  వెనుక సీటులో అజయ్ ఘోష్ కూర్చొని ఉండగా నాని రిక్షా తొక్కే సన్నివేశం మెచ్చుకోదగినది. గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌ను నాని మెప్పించాడని చెప్పవచ్చు.

Advertisement
Advertisement