లోకేష్‌ గ్రాఫిక్స్‌ వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన వర్మ | Sakshi
Sakshi News home page

లోకేష్‌ గ్రాఫిక్స్‌ వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన వర్మ

Published Tue, Mar 12 2024 2:28 PM

Ram Gopal Varma Comments On Nara Lokesh - Sakshi

సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు భీమిలి, దెందులూరు, రాప్తాడులలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు ప్రజాసముద్రం పోటెత్తింది. దీంతో టీడీపీ నాయకులకు నిద్ర పట్టని పరిస్థితి. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ఆదివారం మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సిద్ధం చివరి సభకూ లక్షలాదిగా ప్రజలు తరలి రావడంతో నారా లోకేష్‌  తన ప్రావీణ్యానికి మరింత పదును పెట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ సభలో జనాలే లేరంటూ. అదంతా గ్రాఫిక్స్‌ అని తనలో దాగి ఉన్న మూర్ఖత్వాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు.

ఈ అంశంపై టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టైల్లో సోషల్‌ మీడియా ద్వారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ.. ఇలా సమాధానం చెప్పారు. 'మీ అజ్ఞానానికి అవధులు లేవు.. మీకు సినిమా పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారు.  కాబట్టి, ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్‌లో గ్రాఫిక్స్ ఎలా చేయగలరని మీరు వారిని అడగలేదా..? ముందు ఆ విషయం తెలుసుకోండి.' అని సలహా ఇచ్చారు వర్మ..  అనంతరం ఆయన లోకేష్‌ను ఉద్దేశిస్తూ మరో ట్వీట్‌ చేశారు.. 'నువ్వు మూర్ఖుడివి అని నాకు తెలుసు.. కానీ నువ్వు మూగవాడివని నిరూపించుకున్నావు.' అని తెలిపారు.

లోకేష్‌ గ్రాఫిక్స్‌ వ్యాఖ్యలపై నెట్టింట కూడా పెద్ద దుమారమే రేగింది. విదేశాల్లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివానని గొప్పలు చెప్పుకునే లోకేష్‌కు లైవ్‌ వీడియోను ఎలా గ్రాఫిక్స్‌ చేయగలరు, సాధ్యం కాదనే విషయం తెలియదా..? అని సెటైర్స్‌ వేస్తున్నారు. ఇంకా రాతియుగంలో లోకేష్‌ జీవిస్తున్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నారా లోకేష్, కొందరు టీడీపీ నాయకులు "సిద్ధం" మీటింగ్ కి అసలు జనమే లేరని, కానీ గ్రాఫిక్స్ యాడ్ చేసి లేని జనాన్ని ఉన్నట్టు చూపించారని చెబుతున్నారు. కానీ బుర్రన్న ఎవ్వడికైనా ప్రత్యక్ష ప్రసారంలో గ్రాఫిక్స్ సాధ్యమవ్వవు కదా అని తెలుసు.

అపర మేధావి లోకేష్‌ మాటలను కాసేపు నమ్మేద్దాం. మరైతే ఫోటోలు విడుదల చేయడం ఎందుకు..? టెలికాస్ట్‌ అయిన వీడియోను తీసుకుని మార్ఫింగులెక్కడ జరిగాయో చూపంచరేం..? అలా చేస్తే లోకేష్‌ బండారం బయటపడుతుందని ఇలా కాపీ పేస్ట్‌ ఫోటోలతో సరిపెట్టి తన సోషల్‌ మీడియా ద్వారా టీడపీ కార్యకర్తలను సంతృప్తి పరిచాడు. సీఎం జగన్‌ సభలకు వస్తున్న జనాలను చూసి నీరసించిపోతున్న టీడీపీ క్యాడెర్‌లో ఇలా అయిన ఉత్తేజం నింపుదామనే ప్రయత్నంలో లోకేష్‌ ఉన్నాడు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement