Sakshi News home page

చిత్రం చూడర... 

Published Sat, Oct 28 2023 1:50 AM

Teaser of Varun Sandesh Chitram Chudara is out - Sakshi

వరుణ్‌ సందేశ్, శీతల్‌ భట్‌ హీరో హీరోయిన్లుగా, ‘నేనింతే’ ఫేమ్‌ అదితీ గౌతమ్‌ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ‘చిత్రం చూడర..’. ఆర్‌ఎన్‌ హర్షవర్ధన్‌ దర్శకత్వంలో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ విడుదల చేశారు.

యాక్షన్‌ అండ్‌ సస్పెన్స్‌ అంశాలతో సినిమా కథనం ఉంటుందని టీజర్‌ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: జవహర్‌ రెడ్డి, సహనిర్మాత: ధన తుమ్మల.
 

Advertisement

What’s your opinion

Advertisement