రెచ్చిపోయిన రౌడీ మూకలు | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన రౌడీ మూకలు

Published Sun, Apr 28 2024 11:22 AM

tdp leaders rowdyism in tirupati

తిరుపతి నగరంలో అలజడి నెలకొంది. ప్రశాంతంగా ప్రసారం చేసుకుంటున్న    వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులపై చిత్తూరు రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి.    దుర్భాషలాడుతూ, మహిళలనీ చూడకుండా వారిని పక్కకు నెడుతూ.. దాడికి దిగడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇంతజరుగుతున్నా సంబంధిత కూటమి అభ్యర్థి వారికి సర్దిచెప్పకపోవడం విస్మయానికి   గురిచేస్తోంది. నిత్యం గోవిందనామస్మరణతో మార్మోగే తిరునగరిలో చిత్తూరు రౌడీ కల్చర్‌ వద్దుబాబోయ్‌ అంటూ      స్థానికులు నినదిస్తున్నారు.  

సాక్షి, తిరుపతి : తిరుపతి నగరానికి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరం అని మంచి పేరు ఉంది. ప్రశాంతతకు మారు పేరుగా నిలుస్తోంది. నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఆధ్యాత్మిక నగరంలోకి చిత్తూరు రౌడీయిజం కల్చర్‌ని తీసుకొచ్చారు. ఇనాళ్లు ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో గత కొన్ని రోజులుగా రౌడీ మూకల అరాచకాలు మితిమీరుతున్నాయి. తిరుపతిలో సమర్థవంతమైన నాయకత్వం లేదని గుర్తించిన జనసేన పార్టీ చిత్తూరు నుంచి వైఎస్సార్‌సీపీ తిరస్కరించిన ఆరణి శ్రీనివాసులను దిగుమతి చేసుకుని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతికి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రోజు నుంచే ఇక్కడ రౌడీమూకలు తిష్ట వేశారు.

నగరంలోని పలు హోటళ్లు, హోమ్‌స్టేలు, లాడ్జీలను మే 13 తేదీ వరకు పదుల సంఖ్యలో గదులను రిజర్వ్‌ చేసుకున్నారు. చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కరుడుగట్టిన నేరగాళ్లను తిరుపతిలో దింపినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అతని వద్ద పనిచేసే వందలాది మందిని సైతం ఇక్కడ తిష్ట వేయించారు. ప్రచార ముసుగులో ఆయా ప్రాంతాల్లో పర్యటించే క్రమంలో మద్యం మత్తులో ఉన్న రౌడీ మూకలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే వారి వివరాలు సేకరించి దాడులకు దతెగబడుతున్నారు. అల్లరి మూకల కదలికలపై దృష్టి సారించాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.  

వరుసుగా దాడులు 
జనసేన పార్టీ అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు ప్రకటించి తిరుపతికి దిగుమతి అయిన రోజు నుంచి తిరుపతిలో అల్లరిమూకల తాకిడి ఎక్కువైయింది. మద్యం మత్తులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, వైఎస్సార్‌సీపీ నాయకులపైకి దాడులకు దిగడం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటివి ఇక్కడ సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ వైఎస్సార్‌సీపీ యువనాయకుడిపై టీడీపీ మూకలతో కలిసి చిత్తూరు రౌడీలు దాడికి తెగబడ్డారు. ప్రస్తుతం ఆ యువకుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అలాగే నాలుగు రోజుల క్రితం డబ్బులు పంచుతున్నట్లు సమాచారం రావడంతో సాక్షి ఫొటో గ్రాఫర్, సాక్షి టీవీ రిపోర్టర్‌ ఖాదీకాలనీకి వెళ్లారు. ఫొటోలు తీసే క్రమంలో చిత్తూరు రౌడీలు వారిపై దాడికి దిగారు. కెమెరా, మొబైల్‌ లాక్కుని బీభత్సం సృష్టించారు. స్థానికులు కలగజేసుకుని ఈ దౌర్జన్యమేంటని నిలదీశారు. జీవకోనకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడిని జనసేనలోకి రావాలని తీవ్ర ప్రలోభాలకు గురిచేశారు. ఆ వ్యక్తి ససేమిర అనడంతో నీ అంతు చూస్తామంటూ చిత్తూరు రౌడీమూకలు హెచ్చరించారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. రాబోయే రోజుల్లో చిత్తూరు రౌడీలు ఇంకెన్ని దాడులకు పాల్పడుతారోనన్న చర్చ  జరుగుతోంది.  

వైఎస్సార్‌సీపీ బీసీ నేతలపై దాడి 
తిరుపతి గిరిపురంలో శనివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదే ప్రాంతంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఇతర ప్రాంతాల వాసులు, అల్లరి మూకలతో ప్రచారానికి వచ్చారు. ఈ క్రమంలో ఇరుపారీ్టల నేతలు తారసపడ్డారు. స్థానిక వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు ప్రచారం చేస్తుండగా ఎదురొచ్చిన చిత్తూరు రౌడీమూకలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. స్థానిక బీసీ మహిళా నాయకురాళ్లు ఒకరినొకరు సముదాయించుకుని సమన్వయం పాటించాలని సరి్థచెప్పుకున్నారు. అయితే ప్రచారంలో గుంపుగా ఉన్న బీసీ నాయకులు, మహిళలపైకి అల్లరిమూకలు దూసుకొచ్చారు.

పక్కకు నెడుతూ నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. మద్యం మత్తులో ఉన్న చిత్తూరు రౌడీలు నలుగురు మహిళలపై దౌర్జన్యానికి దిగి చెయ్యి చేసుకున్నారు. రెచ్చగొడుతూ మరింత ముందుకు దూసుకురావడంతో అక్కడ తీవ్ర అలజడి నెలకొంది. జనసేన అభ్యర్థి అక్కడే ఉన్నా తన అనుచరవర్గం, అల్లరిమూకలను అదుపు చేయపోవడం పట్ల నగర వాసులు మండిపడుతున్నారు. ఈ చిత్తూరు రౌడీయిజం కల్చర్‌ మా కొద్దు బాబోయ్‌ అంటూ నినదించారు. బీసీ నాయకులు, మహిళలతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో వివాదం సద్దుమణిగింది.  

Advertisement
Advertisement