అతని తెలివితేటలు అపారం! | Sakshi
Sakshi News home page

అతని తెలివితేటలు అపారం!

Published Mon, Sep 18 2023 1:27 AM

Teaser: YouTuber Harsha Sai Debuts With Mega - Sakshi

హర్ష సాయి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మెగా’. మిత్ర ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ, నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్నే కుదిపేసే రాజైన మనిషిది’, ‘అతని తెలివితేటలు అపారం’ వంటి డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. హర్ష సాయి మాట్లాడుతూ– ‘‘మంచి కథలు చెప్పడానికి ప్రస్తుతం ఉన్న పెద్ద మాధ్యమం సినిమా.

నేను చిత్రాలను ఎంచుకోవడానకి ఇదే తొలి కారణం. అలాగే యువ ప్రతిభను ప్రోత్సహించాలనుకోవడం మరో కారణం’’ అన్నారు. హీరోయిన్ , నిర్మాత మిత్ర మాట్లాడుతూ– ‘‘చిన్న ఆలోచనగా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ చాలా భారీ స్థాయికి వెళ్లింది. 2024లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: వికాస్‌ బాడిసా, కెమెరా: కార్తీక్‌ పళని, సమర్పణ: కల్వకుంట్ల వంశీధర్‌రావు, సహ నిర్మాత: పడవల బాలచంద్ర. 

Advertisement
 
Advertisement
 
Advertisement