మీ మ‌ర‌ణ‌వార్త జీర్ణించుకోలేక‌పోతున్నా.. ఎన్నో త్యాగాలు చేశారు.. | Varun Sandesh Wife Vithika Sheru Emotional Post Over Lost His Family Member- Sakshi
Sakshi News home page

Vithika Sheru: మీ స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు.. వితికా ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Published Sun, Feb 25 2024 2:10 PM

Varun Sandesh Wife Vithika Sheru Emotional Post Goes Viral - Sakshi

వ‌రుణ్ సందేశ్‌- వితికా షెరు.. ఒక‌ప్పుడు ఇద్ద‌రూ హీరోహీరోయిన్సే.. కానీ ఆ క్రేజ్‌ను అలాగే కొన‌సాగించ‌డంలో వీరు విఫ‌ల‌మ‌య్యారు. అయితే వ‌రుణ్ ఇటీవ‌లే హీరోగా మ‌రోసారి త‌న ల‌క్ ప‌రీక్షించుకున్నాడు. అటు వితిక‌.. యూట్యూబ‌ర్‌గా మారి క్రియేటివ్ వీడియోల‌తో అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఇటీవ‌లే వీరు త‌మ ఇంటికి కొన్నిమార్పులుచేర్పులు చేసి గృహప్రవేశం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

తాజాగా ఆమెకు బాగా కావాల్సిన వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్ల‌డించింది. అత‌డితో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'మా కుటుంబానికి మార్గ‌నిర్దేశం చేసిన వ్య‌క్తి ఇక‌లేరు. ఈ విష‌యం తెలిసి మేమంతా షాక‌య్యాం. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాం. మీరు ఎంతోమందికి స‌పోర్ట్ చేశారు.

వారంద‌రికీ మీరొక గాడ్ ఫాద‌ర్‌లా ఎప్పటికీ గుర్తుండిపోతారు. జ‌నాల‌ను సంతోషంగా ఉంచ‌డానికి ఎన్నో త్యాగాలు చేసిన మీకు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. మీ స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు. ఆ భ‌గ‌వంతుడి వ‌ద్ద ప్ర‌శాంతంగా నిద్ర‌పోండి' అని రాసుకొచ్చింది. అయితే మ‌ర‌ణించిన‌ స‌ద‌రు వ్య‌క్తి పేరును మాత్రం వెల్ల‌డించ‌లేదు.

చ‌ద‌వండి:  బర్త్‌డేకి బంగారపు కేకు కట్‌ చేసిన హీరోయిన్‌.. ఫోటోలు వైరల్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement