ఫ్యామిలీ స్టార్ క్రెడిట్ అంతా ఆయనకే: విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ | Sakshi
Sakshi News home page

Family Star Movie: కథ విన్నప్పుడు మా నాన్న గుర్తుకొచ్చాడు: విజయ్ దేవరకొండ

Published Thu, Apr 4 2024 3:48 PM

Vijay Devarakonda Crazy Comments On Family Star Movie Director - Sakshi

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్‌. గీతగోవిందం తర్వాత పరశురామ్- విజయ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్‌ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో ‍అలరించనుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరశురామ్‌పై ప్రశంసలు కురిపించారు. 

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..'ఫ్యామిలీ స్టార్ నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ మూవీ. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకొచ్చాడు. ఈ సినిమాలో నా ఫర్మామెన్స్‌ నెక్ట్ లెవెల్ అని పరశురామ్ అంటున్నాడు. కానీ ఈ క్రెడిట్ మొత్తం పరశురామ్‌కే ఇవ్వాలి. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురాముడే. ఆయన లేకుంటే ఫ్యామిలీస్టార్ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది' అని అన్నారు. కాగా.. వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 

Advertisement
Advertisement