Vijay Deverakonda Liger Movie Exhibitors Protest Infront Of Film Chamber Against Liger Loss - Sakshi
Sakshi News home page

Liger Movie: 'లైగర్' మూవీ ఎఫెక్ట్‌.. ఆందోళనకు దిగిన ఎగ్జిబిటర్స్!

Published Fri, May 12 2023 3:45 PM

Vijay Deverakonda Liger Movie Exhibitors Protest Against Loss With Movie - Sakshi

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'లైగర్‌'. అనన్యా పాండే కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఛార్మి, పూరీ జగన్నాథ్‌, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

(ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్‌ అవార్డులు.. నెటిజన్స్‌ ట్రోలింగ్‌)

అయితే భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా వల్ల తాము ఎంతో డబ్బు నష్టపోయామంటూ  నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే నష్టాన్ని భర్తీ చేస్తామని చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్‌, డిస్ట్రిబ్యూటర్‌ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ తమకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ ఇ‍చ్చిన గడువు ముగియడంతో ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగారు. 

(ఇది చదవండి: బీస్ట్‌ మోడ్‌లో హీరో సూర్య.. వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ ఫోటో)

Advertisement
Advertisement