మార్కులు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక | Sakshi
Sakshi News home page

మార్కులు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక

Published Thu, Apr 25 2024 6:02 PM

UP Class 10 student collapsed upon seeing result admitted to ICU - Sakshi

మీరట్‌: పదో తరగతి పరీక్షల్లో తనకు వచ్చిన మార్కులు చూసి మూర్చపోయి ఐసీయూలో చేరాడో విద్యార్థి. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి తనకు బోర్డు పరీక్షల్లో చెప్పుకోదగ్గ 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయాడు. రిజల్ట్స్‌ చూసి కుప్పకూలిపోవడంతో ఐసీయూలో చేర్చవలసి వచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌ బోర్డ్ హైస్కూల్‌  లేదా 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఫలితాలను శనివారం ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులు 89.55 శాతం ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతి విద్యార్థులు 82.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మీరట్‌లోని మోడిపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్‌కు చెందిన అన్షుల్ కుమార్ తన పరీక్షలలో 93.5 శాతం మార్కులు సాధించాడు. అయితే, ఫలితాలను చూడగానే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అన్షుల్ తండ్రి, పోస్టాఫీసులో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే సునీల్ కుమార్ తెలిపారు. కాగా అన్షుల్ పరిస్థితి ప్రస్తుతం కుదటపడినట్లు తెలిసింది.

Advertisement
Advertisement