మైనార్టీలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

మైనార్టీలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌

Published Mon, May 6 2024 9:00 AM

మైనార

రాయదుర్గం టౌన్‌: దశాబ్దాలుగా అణచివేతకు గురైన ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచి వారి సంక్షేమానికి, భద్రతకు భరోసానిచ్చిన ఏకై న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని రాయదుర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని ఆత్మీకూరు వీధిలోని మైదానంలో జరిగిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మతతత్వ బీజేపీతో టీడీపీ, జనసేన చేతులు కలపడమంటే ముస్లిం వ్యతిరేక నిర్ణయాలకు మద్దతు ప్రకటించినట్లేనని అన్నారు. ముస్లిం మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే మంచి జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

రిజర్వేషన్లను కాపాడుకుందాం

దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్‌ వరప్రసాదంగా నిలిచిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను అధికారంలోకి రాగానే రద్దు చేస్తామంటూ ఇప్పటికే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారని, అలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు మాటలను నమ్మి ఓటు వేస్తే రిజర్వేషన్‌ హక్కును కోల్పోవాల్సి ఉంటుందని మెట్టు గోవిందరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్‌తో పాటు ఇతర హక్కులను కాపాడుకోవాలంటే ముస్లిములంతా వైఎస్సార్‌సీపీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్‌ఆర్‌సీని రాష్ట్రంలో లేకుండా చూడాలన్నా, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్‌ చేసిన తీర్మానాన్ని కాపాడుకోవాలన్నా, యూనిఫాం సివిల్‌కోడ్‌ను ఎదుర్కొవాలన్నా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే రావాలన్నారు.

చంద్రబాబుకు గుణపాఠం చెబుదాం

ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మెట్టు గోవిందరెడ్డి కోరారు. రాజకీయంగా అభివృద్ధి చెందకుండా ముస్లింలను అణచివేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. సీఎం జగన్‌ ఓ ఉప ముఖ్యమంత్రిని, ఓ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ను. నలుగురు ఎమ్మెల్యేలను, నలుగురు ఎమ్మెల్సీలతోపాటు అనేక పదవులను ముస్లింలకు కట్టబెట్టారన్నారు. మరోసారి జగన్‌కు ముస్లిం సమాజం అండగా ఉండాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పొరాళ్ల శిల్ప, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు వలిబాషా, శ్రీనివాసయాదవ్‌, పట్టణ కన్వీనర్‌ అరవా శివప్ప, వైఎస్సార్‌సీపీ నాయకుడు పొరాళ్ల శివకుమార్‌, వార్డు కౌన్సిలర్లు నసీమా, కౌన్సిలర్‌ లుబ్నా గజాల, శారదమ్మ, శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ గోనబావి సర్మాస్‌, వార్డు ఇన్‌చార్జ్‌లు గోల్డ్‌ ఇస్మాయిల్‌, గోనబావి నిజాముద్దీన్‌, శ్రీరామిరెడ్డి, నాయకులు మాధవరెడ్డి, నాగప్ప, రఘురాం తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు

మైనార్టీలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌
1/1

మైనార్టీలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌

Advertisement
Advertisement