మందు, డ్రగ్స్‌కి దూరం | Sakshi
Sakshi News home page

మందు, డ్రగ్స్‌కి దూరం

Published Sun, Oct 24 2021 5:56 AM

Congress Party rules for new members - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కొత్తగా తీసుకోవాలని అనుకునే వారికి ఆ పార్టీ నూతన నిబంధనలు ప్రవేశపెట్టింది. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, పార్టీ విధానాలను, కార్యక్రమాలను ఎప్పటికీ బహిరంగ వేదికలపై విమర్శించబోమని ఒక సెల్ఫ్‌ డిక్లరేషన్‌ (స్వీయ ధ్రువీకరణ పత్రం) ఇవ్వాలని షరతు విధించింది.

నవంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు చేపట్టనుంది. సభ్యత్వం కోసం రూపొందించిన దరఖాస్తు పత్రంలో కొత్తగా సభ్యులుగా చేరాలనుకునే వారు కచ్చితంగా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చి తీరాలి.  ఆదాయానికి మించి ఆస్తులు లేవని, పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల కోసం శారీరక శ్రమకు సిద్ధమేనని అంగీకరించాలి. సామాజిక వివక్ష  చూపించమని, వివక్ష, అసమానతల నిర్మూలనకు కృషి చేస్తామని ఇలా మొత్తం 10 పాయింట్లకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తేనే కాంగ్రెస్‌ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లభిస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement