Silent Village of India: అక్కా చెల్లెళ్ల ‘నిశ్శబ్ద’ విప్లవం | Lok Sabha Elections 2024: Deaf-Mute Sisters Of Silent Village Inspire Voters To Participate In Festival Of Democracy - Sakshi
Sakshi News home page

Silent Village Of India: అక్కా చెల్లెళ్ల ‘నిశ్శబ్ద’ విప్లవం

Published Fri, Apr 19 2024 5:15 AM

Lok sabha elections 2024: Deaf-Mute Sisters Of Silent Village Inspire Voters To Participate In Festival Of Democracy - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటేయనున్నారు..

గ్రామానికే స్ఫూర్తిదాయకంగా నిలిచారు..  

గందోహ్‌(జమ్మూకశ్మీర్‌): ఆరోగ్యంగా ఉండి కూడా ఓటేయడానికి బద్ధకించే పౌరులున్న దేశం మనది. అలాంటిది పుట్టుకతోనే చెవుడు, మూగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ కూడా ఓటేయడానికి ముందుకొచ్చి మొత్తంగా గ్రామానికే ప్రేరణగా నిలిచిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక         గాథ ఇది.  

గ్రామంలో సగం కుటుంబాలకు సమస్యలు
జమ్మూకశీ్మర్‌లోని డోడా జిల్లాలోని భద్రవాహ్‌ పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలోని కొండప్రాంతంలో దధ్‌కాయ్‌ గిరిజన గ్రామం ఉంది. గ్రామంలో కేవలం 105 కుటుంబాలే నివసిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే 55 కుటుంబాలను దశాబ్దాలుగా ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టాయి. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మూగ, చెవిటివారిగా మిగిలిపోతున్నారు. ఇలా గ్రామంలో 84 మంది ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, పదేళ్లలోపు 14 మంది చిన్నారులు ఉన్నారు.

ఎక్కువ మంది మాట్లాడలేని కారణంగా ఈ గ్రామానికి సైలెంట్‌ విలేజ్‌ ఆఫ్‌ ఇండియా అనే పేరు పడిపోయింది. రేహమ్‌ అలీ ముగ్గురు కూతుళ్లు రేష్మా బానో(24), పరీ్వన్‌ కౌసర్‌(22), సైరా ఖాటూన్‌(20)లకూ ఏమీ వినిపించదు. మాట్లాడలేరు కూడా. అయితే ఓటేసి తమ హక్కును వినియోగించుకోవాలనే కోరిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో బలంగా నాటుకుపోయింది.

ఈసారి ఎలాగైనా ఓటేస్తామని ముగ్గురూ ఘంటాపథంగా చెబుతున్నారు. వీళ్లు ఓటేస్తుండటం ఇదే తొలిసారికావడం విశేషం. బీజేపీ నేత జితేంద్రసింగ్‌ పోటీచేస్తున్న ఉధమ్‌పూర్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే ఈ గ్రామం ఉంది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌లో ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమ ఊరికొచి్చన మీడియా వాళ్లకు ఈ అక్కాచెల్లెళ్లు తమ ఓటర్‌ ఐడీ కార్డులు చూపించిమరీ చెబుతున్నారు.

‘ మొదటిసారిగా ఓటేయనున్న మ్యూట్‌ మహిళల ఉత్సాహం ఊరి జనం మొత్తానికి స్ఫూర్తినిస్తోంది’ అని పొరుగింటి వ్యక్తి జమాత్‌ దానిష్‌ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ ఔత్సాహిత యువ మహిళా ఓటర్లను చూసి మొత్తం గ్రామమే గర్వపడుతోంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఈ సారి ఇక్కడ 100 శాతం పోలింగ్‌ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు ’’ అని గ్రామ మాజీ వార్డు సభ్యుడు మొహమ్మద్‌ రఫీఖ్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement