విధుల్లో అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Published Fri, Apr 19 2024 1:35 AM

మాట్లాడుతున్న ఎస్‌ఈ జేఆర్‌.చౌహన్‌  - Sakshi

● విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జేఆర్‌.చౌహన్‌ ● అధికారులు, సిబ్బందికి ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌పై శిక్షణ

ఖానాపూర్‌: విద్యుత్‌ శాఖలో పనిచేసే ప్రతీ ఉద్యోగి, సిబ్బంది నిరంతరం భద్రత గురించి ఆలోచించడంతోపాటు సురక్షితంగా పనిచేయాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జేఆర్‌.చౌహన్‌ సూచించారు. ఉత్తర విద్యుత్‌ సంస్థ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని సత్తనపల్లి రైతువేదికలో ఖానాపూర్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని మండలాలకు చెందిన విద్యుత్‌ శా ఖ అధికారులు, సిబ్బందికి ఆపరేషన్స్‌ అండ్‌ మె యింటనెన్స్‌పై గురువారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ సబ్‌స్టేషన్‌ డ్యూటీలో ఉన్నప్పుడు సేఫ్టీ షూస్‌తోపాటు సేఫ్టీ హెల్మెట్‌, సేఫ్టీ గ్లౌజ్‌ ధరించాలని తెలిపారు. ఫీడర్‌కు ఎల్‌సీ ఇచ్చేటప్పుడు ఎర్త్‌ డిస్టార్ట్‌ రాడ్‌ను వాడాలన్నారు. విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సేవలు అందించాలని తెలిపారు. అంతకుముందు పలు విషయాలను ప్రొజెక్టర్‌ సాయంతో వీడియో ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కన్‌స్ట్రక్షన్‌ సీజీఎం కేఎన్‌.గుట్ట, నిర్మల్‌ డీఈ నాగరా జు, టెక్నికల్‌ డీఈ బి.శ్రీనివాస్‌రావు, జిల్లా గణాంక అధికారి సుదర్శన్‌, ఏడీఈ కేశెట్టి శ్రీనివాస్‌, ఏఈలు తిరుపతి, సుమన్‌, బాలయ్య, శ్రీనివాస్‌, మాస్టర్‌ ట్రైనర్లు శ్రీనివాస్‌, రాజు, తిరుపతి, సబ్‌ ఇంజనీర్లు వెంకటేశ్‌, స్వాతి, శ్యాంసుందర్‌, నాగరాజు, లైన్‌మెన్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement