బాబు గురి గులకరాయిపైనే! | Sakshi
Sakshi News home page

బాబు గురి గులకరాయిపైనే!

Published Sat, Apr 20 2024 4:24 AM

CM Jagan in memantha siddham meeting at kakinada district - Sakshi

కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్‌ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ ధ్వజం 

ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి.. లేదంటే మళ్లీ కత్తిరింపులు.. అన్నీ ముగింపులే.. చంద్రముఖి నిద్ర లేస్తుంది.. పసుపు పతి వదల బొమ్మాళీ అంటాడు 

ఐదేళ్లు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తాడు

గతంలో పలు కారణాలతో నాకు ఓట్లేయని వారూ ఆలోచించండి 

పసుపు, గ్లాసు పార్టీల నాయకులు అబద్ధాలాడినా.. మనం చేసిన పనులే సాక్ష్యం 

మీ అందరికీ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా?.. మీ బిడ్డ ఒక్కడు.. నక్కలు, తోడేళ్లు మాత్రం అనేకం.. 

చంద్రబాబు తన చంకలో పిల్లిని పిఠాపురంలో వదిలాడు 

ప్యాకేజీ స్టార్‌ ఎక్కడ నిలబడాలో నిర్ణయిస్తే కుదిరిన పొత్తులవి.. 

జగన్‌ను తిట్టు అంటే తిట్టు.. కొట్టు అంటే కొట్టు.. అన్నిటికీ జీ హుజూర్‌!  

కులాన్ని హోల్‌సేల్‌గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ రాజకీయాలు 

రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ వెళ్తాడు 

గ్లాసుతో గటగటా తాగేది బాబు.. తోమి, తుడిచి మళ్లీ అందించేది మాత్రం ప్యాకేజీ స్టార్‌ 

30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్టుగానే వదినమ్మ.. బీఫామ్‌ బీజేపీదైనా, కాంగ్రెస్‌దైనా, టీ గ్లాస్‌దైనా యూనిఫామ్‌ మాత్రం బాబుదే  

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘ఎన్నికలకు ఇక 25 రో­జు­లే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ న గా­­రా కూడా మోగింది. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పే­­ద­లు, అక్క­చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడు­తున్న మ­నందరి ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మీ­రంతా సిద్ధ­మేనా? జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు దాకా పెత్తందార్ల దోపిడీకి, మనందరి పే­దల పక్ష­పాత ప్రభుత్వానికి మధ్య ఈరోజు క్లాస్‌­వార్‌ జరు­గుతోంది. చంద్రబాబు సుదీర్ఘకాలం అధి­కా­రంలో ఉ­న్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మం­చి ప­నిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు కాబట్టే  నాపై వే­యించటానికి బాబుకు, ఆయన కూటమికి చివ­రకు గులక రాళ్లే మిగిలాయి.

ఈ యుద్ధంలో ఆ పేద­ల వ్య­తిరేక కూటమిని చిత్తుగా ఓడించేందుకు మీ­రంతా సిద్ధమేనా? మరోసారి జైత్రయాత్రకు సింహ­గర్జ­నతో సిద్ధం కావాలి. ఫ్యాన్‌కు 2 ఓట్లు వేసి రా­ష్ట్ర భవి­ష్యత్తును కాపాడుకుందాం’’అని సీఎం, వై­ఎ­స్సార్‌­సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్ర­వారం కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్‌లో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ స­భలో భారీ జనసందోహాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. 

పసుపు పతి నిద్ర లేస్తాడు.. జాగ్రత్త!
అభిమాన సముద్రంగా మారిన వరద గోదావరి ఇ­వాళ ఇక్కడ కనిపిస్తోంది. ఐదేళ్లుగా మనందరి ప్రభు­త్వం మంచి చేసిందన్న నమ్మకం ఇక్కడ కనిపిస్తోంది. ఆ మంచిని కాపాడుకోవాలన్న సంకల్పం ఈ­రోజు మీ అందరిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికలు కేవ­లం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకు­నేవి కాదు. రా­బోయే ఐదేళ్లు.. అంటే 1,825 రోజులు.. రాబోయే 60 నెలల పాటు మన బతుకులు ఎలా ఉంటాయి? అనేది నిర్ణయించే మన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మీకు ఈరోజు జగన్‌ ద్వారా అందుతున్న పథకాలు ఇక మీదట కూడా అందాలా? లేక అవి రద్దు కావడం అన్నది మీ ఓటుపైనే ఆధా­రపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

జగన్‌కు ఓటు వేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న నిజం. బాబు మోసాల మేనిఫెస్టో చెబుతున్న వాస్తవం. ఫ్యాన్‌కు ఓటు వేస్తే గ్రామగ్రామాన, పట్టణాల్లో సేవలందిస్తున్న జగన్‌ మార్కు సచివాలయాలన్నీ కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు తథ్యం. ఫ్యాన్‌కు ఓటు వేస్తే అవ్వా­తాతలకు ఇంటివద్దే రూ.3,000 పెన్షన్‌ అందుతుంది.

ఇంటికే వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ల ద్వారా  జగన్‌ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా గత 58 నెలల్లో డీబీటీ ద్వారా మీ బిడ్డ నేరు­గా బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. పొరపా­టు­న చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. మళ్లీ  పసుపు పతి నిద్ర లేస్తాడు! వదల బొమ్మాళీ.. వదల.. అంటూ మళ్లీ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు ప్రతి ఇంటికీ వస్తాడు. జాగ్రత్త సుమా..! 

ఒక్క ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే..
ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే విత్తనం నుంచి పంట విక్ర­యం వరకూ ఇప్పుడు సేవలందిస్తున్న ఆర్బీకే­లు కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకేలకు బాబు మా­ర్కు కత్తిరింపులు, ముగింపు ఖాయం. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఏటా క్రమం తప్పకుండా అందుతుంది.

ఫ్యాన్‌ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, సున్నావడ్డీకే పంట రుణాలు, సకా­లంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటిపూటే వ్యవసా­యానికి 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యు­త్తు, దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొను­గోళ్లు నిరాటంకంగా జరుగుతాయి. లేదంటే మళ్లీ చంద్రబాబు మార్కు పాలన, మళ్లీ కత్తిరింపులు, పథకాలన్నీ ముగింపు జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. 

పెద్దవారి పిల్లలు అసూయపడేలా..
ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే.. గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం, రూపురేఖలు మారిన స్కూళ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ, సబ్జెక్టు టీచర్‌ కాన్సెప్ట్, బైజూస్‌ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన, ఐఎఫ్‌పీ ప్యానళ్లు, 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, ఉన్నత చదువులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, డిగ్రీ వి­ద్యార్థులకు సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ ద్వారా విదేశీ వర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, తొలి­సారిగా డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌.. ఇవన్నీ కొ­న­సాగుతాయి. మీ జగన్‌ ఇదే స్థానంలో ఉంటే మరో పదేళ్లలో పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లిష్‌ మా­ట్లా­డతారంటే.. వారు అనర్గళంగా మాట్లాడే మా­టలకు పెద్దవారి పిల్లలు అసూయ పడే పరిస్థితి వస్తుంది.  

బాబుకు ఓటేస్తే కత్తిరింపులు.. ముగింపు
ఫ్యాన్‌పై రెండు ఓట్లు పడితే జగన్‌ మార్కు విప్ల­వాలన్నీ కొనసాగుతాయి. లేదంటే గవర్నమెంట్‌ బ­డుల్లో ఇంగ్లిష్‌ మీడియం రద్దు, స్కూళ్ల రూపు­రేఖలు మార్చే నాడు–నేడు రద్దు, బడి పిల్లలకు రోజుకో మెనూతో ఇచ్చే గోరుముద్ద రద్దు, బడులు తె­రిచే సమయానికి పిల్లలకు ఇస్తున్న విద్యాకానుక రద్దు, 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన రద్దు.. 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు రద్దు.. వీట­న్నిటికీ కత్తిరింపులు ముగింపే! 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు.. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు రద్దు అవుతాయి.  అందుకే ఆలోచన చే­యండి. పొరపాటు జరిగిందంటే..మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. నిద్ర లేచి మీ పిల్లల చదువులు, బడులు అన్నిటికీ లకలక.. లకలక అంటూ ముగింపు పలుకుతుంది. 

విప్లవాత్మక పాలన కొనసాగేందుకు..
ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజీ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దే పరీక్షలు – మందులు, నాడు– నేడుతో రూపురేఖలు మారిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉత్తమ సేవలు, రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం, ఆపరేషన్‌ తరువాత జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా, 17 కొత్త మెడికల్‌ కాలే­జీల నిర్మాణం లాంటి ప్రతి పేదవాడిని బతికించే జగన్‌ మార్కు విప్లవాత్మక పాలన కొనసాగుతుంది. లేదంటే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొ­మ్మాళీ అంటుంది.

పేదవాడు అప్పుల పాలై వైద్యం అందని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది ఆ చంద్రముఖి. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే అక్కచెల్లెమ్మల రాజ్యం, పిల్ల­లను బడులకు పంపే అమ్మలకు అమ్మ ఒడి, చదు­వు­లకు ఇబ్బంది లేకుండా విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీ­సీ నేస్తం, వైఎస్సార్‌ జగనన్న కాలనీలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహాల నిర్మాణం.. అన్నీ కొనసాగి వేగంగా అడుగులు ముందుకు పడతాయి. 

గతంలో నాకు ఓట్లేయని వారూ ఆలోచించండి..
పొదుపు సంఘాల మహిళలకు బాబు చేసిన మో­సాలు గుర్తున్నాయా? ఓటు వేసే ముందు మీ కు­టుంబమంతా కూర్చుని బాగా ఆలోచన చేయండి. ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి. ఎవరివల్ల మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందనే ఆలోచనతో ఓటు వేయాలని కోరు­తున్నా. మీ తలరాతలను మార్చే ఎన్నికలివి. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కొనసాగాలా? లేక రాష్ట్రాన్ని పెత్తందార్లు అందరూ కలసి దోచుకుని, పంచుకునే కూటమి పాలన కావాలా? 58 నెలలుగా మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో పలు కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతు­న్నా. కులం కారణం కావచ్చు.. ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామనే కారణం కావచ్చు.. లేదా ఇ­తర కారణాలు కావచ్చు.. ఆ అన్నదమ్ములను, అ­క్కచెల్లె­మ్మలను, అవ్వా­తాతలను కూడా అడుగు­తు­న్నా. గత ఎన్నికల్లో మీరు నాకు ఓటు వేయక­పోయినా ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? అని ఒక్కసారి ఆలోచన చేయమని కో­రుతున్నా.

మీ ఇంటికి వచ్చిన పసుపు నాయ­కులు, క్లాస్‌ నా­యకు­లు అబద్ధాలు చెప్పవచ్చుగానీ మీ కుటుంబానికి, మీ బ్యాంక్‌ ఖాతాల్లోకి 58 నెలల పాలనలో జమ అయిన, చేతికి అందిన పథ­కా­ల డబ్బులు మీకు ని­జా­లే చెబుతాయి. ఇంటికే వ­లంటీర్ల సేవలు, ఇంటి వద్దకే పెన్షన్, రేషన్, వైద్యం, సర్టిఫికెట్లు, ఇళ్ల పట్టా­లు.. ఇవన్నీ మీకు నిజాలే చెబుతాయి. మారి­పోయిన మన గవర్నమెంట్‌ స్కూళ్లు, పిల్లల చదు­వులు, గ్రా­మంలోనే వైద్య సేవలు, వ్యవసాయం.. ఇ­వన్నీ మీ­కు వాస్తవాలు చెబుతాయి. ఎవరి పాలనలో మీకు మంచి జరిగిందో ఆలోచన చేయండి. 

2014లో బాబు మోసాలివీ..
 రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? 
♦  పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?
♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్‌ చేశారా?
 ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. 
♦ ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా?
 అర్హులైన వారందరికి మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు.  ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా?
 రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్‌ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా?
♦  మహిళా ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? 
♦ సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? 
♦ ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? కాకినాడలో కనిపిస్తోందా? పోనీ పిఠాపురంలో కట్టారా? 
♦ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అదీ లేదు.
♦ ఇప్పుడు సూపర్‌ సిక్స్, సెవెన్, ఇంటికి కేజీ బంగారం అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. 

ఇన్ని మోసాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబు నుంచి సెల్‌ఫోన్లు బయటకు తీసి టార్చిలైట్లు వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని వ్యవస్థలు, మన చదువులు, పిల్లలు, రైతన్నలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి. 

బాబు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌!
ఇంటింటికీ మంచి చేశాడు కాబట్టి ఈ ఎన్నికల యుద్ధానికి మీ బిడ్డ ఒంటరిగా బయల్దేరాడు. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకే ఏ మంచిపనీ లేదు కాబట్టి వారంతా కూటమిగా ఏకమయ్యారు. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పాటైన కూటమి కాదు. ఎన్ని టికెట్లు ఇవ్వాలి? ఎవరు పోటీ చేయాలి? చివరికి ఆ ప్యాకేజీ స్టార్‌ ఎక్కడ నిలబడాలో కూడా బాబు నిర్ణయిస్తేనే కుదిరిన పొత్తులవి.

ఆ ప్యాకేజీ స్టార్‌ను భీమవరం.. గాజువాక.. పిఠాపురం.. ఇలా ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుందనుకుంటే అక్కడ నిలబెట్టిన పరిస్థితి!ఇక బాబు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌! జగన్‌ను తిట్టు అంటే తిట్టు..! కొట్టు అంటే కొట్టు..! దత్తపుత్రా నీకిచ్చేది 80 కాదు.. 20 అంటే అందుకు కూడా జీ హుజూర్‌! ఇదీ ప్యాకేజీ స్టార్‌ పరిస్థితి! 

కులాన్ని హోల్‌సేల్‌గా అమ్మేయగలననే భ్రమతో..
ఏపీని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచు­కు­నేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే.. కులాన్ని హోల్‌సేల్‌గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్‌ రాజకీయం చేస్తున్నాడు. ఈయనకు ఏపీ అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరా­బాద్‌ వెళ్తాడు. ఏ ప్రాంతమన్నా ప్రేమ ఉండ­దు ఈ మ్యారే­జీ స్టార్‌కు. ఏ భార్య అయినా ప్రేమ ఉండ­దు! పెళ్లిళ్లే కా­దు..నియోజకవర్గాలు కూడా మార్చేశాడు.

వెనుకటికి ఒక­డు పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకన బె­టు­్టకెళ్లాడట! ఆ పిల్లిని చంకన బెట్టుకెళ్లింది ఎవరో ఇంతకా­లం ఎవరికీ అ­ర్థం కాలేదు. బాబు తన చంకలో ఉన్న పిల్లిని పిఠాపురంలో వదిలినట్లు ఇప్పుడు అర్థమైంది. ఇదీ గాజు గ్లాస్‌ పార్టీ పరి­స్థితి. ఈ గ్లాస్‌తో గటగట తాగేది బాబు.. దా­న్ని తోమి, తు­డి­చి మళ్లీ బాబుకు అందించేది మాత్రం.. ఈ ప్యాకేజీ స్టార్‌! 

బాబు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌తో.. బీజేపీలోకి వదినమ్మ
ఈ కూటమిలో వదినమ్మ బాబు చేరమంటే కాంగ్రెస్‌లో చేరింది. ఇదే బాబు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. బాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది! 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా.. బాబు కోవర్టుగా అదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికే ఇస్తారు. వద్దంటే వారిని ఆపేస్తారు, మారుస్తారు. చంద్రబాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. బీఫామ్‌ బీజేపీదైనా, కాంగ్రెస్‌దైనా, టీ గ్లాస్‌దైనా యూనిఫామ్‌ మాత్రం అంతా చంద్రబాబుదే! 

మత్స్యకారులకు మాటిస్తున్నా..
కాసేపటి క్రితం కన్నబాబు అన్న మాట్లాడుతూ మత్య్సకారుల సమస్యల గురించి ప్రస్తావించారు. నాకు మంచి మనసు ఉంది కాబట్టే.. ముమ్మిడివరంలో జరిగిన నష్టాన్ని, ఎప్పటి నుంచే పరిష్కారం కాని సమస్యను పరిష్కరించాం. ఓఎన్‌జీసీ కమిటీని ఏర్పాటు చేయటానికి మీ బిడ్డ ప్రభుత్వ చొరవే కారణమనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కమిటీ సిఫారసులు ఆధారంగా ప్రతి మత్య్సకార కుటుంబానికి మంచి జరిగేలా మీ బిడ్డ తోడుగా ఉంటాడని మాట ఇస్తున్నా. 

బాబుకు మిగిలింది గులక రాళ్లే...
చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికలు ముగిసేదాకా రంగురంగుల స్వప్నాలను చూపిస్తుంది. ఆ తరువాత చెత్తబుట్టలో మినహా ఎక్కడా కని­పిం­చదు. ఎన్నికల తరువాత మోసాలు చేయ­డం చంద్రబాబు నైజం! ఆయన పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలు రాళ్లు ఏవీ లేవు. మంచి వ్యవస్థలు గానీ, పథకాలుగానీ, ప్రజలకు చేసిన మంచిగానీ ఒక్కటీ లేవు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు  అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు. కాబట్టే నాపై వేయించటానికి చంద్రబాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. 

మన మైలు రాళ్లు.. 
గత 58 నెలల పాలనలో మనం వేసిన పునాది రాళ్లు, మైలు రాళ్లు చరిత్రలో ఎప్పటికీ విప్లవాలుగా నిలిచిపోతాయి. కాబట్టే మనం జెండా తలెత్తుకుని ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతోంది. ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా? వద్దా? ఆలోచన చేయమని కోరుతున్నా. ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని ప్రతి ఇంట్లో స్టార్‌ క్యాంపైనర్లుగా ముందుకు వచ్చి వివరించాలి. బాబు గత చరిత్రను, 2014లో ఇదే కూటమి పేరుతో చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి.

Advertisement
Advertisement