టెక్నాలజీ పరంగా మార్కెట్‌లోకి ఫీచర్స్ కలిగిన పరికరాలు ఎన్నో వస్తున్నాయి. మారుతున్న కాలానికనుగుణంగా.. కంప్యూటర్, మొబైల్, వాచ్‌లే కాకుండా, స్మార్ట్ ఫీచర్‌లు కలిగిన ఇతర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త టెక్నాలజీ విధానం సంతరించుకుని స్మార్ట్ థింకింగ్‌లా పనిచేసే వీటి తీరుని గురించి తెలుసుకుందాం.
విండోస్ 11లో ఏఐ ఎక్స్‌ప్లోరర్..
విండోస్ 11లో ‘ఏఐ ఎక్స్‌ప్లోరర్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. కన్వర్‌సెషన్స్, వెబ్‌పేజీలు, ఈమెయిల్స్‌ను సమరైజ్ చేయడం నుంచి ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ను రిమూవ్ చేయడంలాంటి కాంప్లెక్స్ టాస్క్‌ల వరకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఇది స్క్రీన్ టాప్‌పై కనిపిస్తుంది. ‘ఏఐ ఎక్స్‌ప్లోరర్’ అనేది సెర్చ్ ఇంజిన్‌లాగే కాదు స్క్రీన్‌కు సంబంధించిన విషయాలను అనలైజ్ చేయడానికి, సూచనలు ఇవ్వడానికి ఉపకరిస్తుంది. ఇక మరో ఫీచర్ ‘స్క్రీన్ అండర్‌స్టాండింగ్’ ఇమెయిల్ రిప్లై్స జెనరేట్ చేయడానికి యూజర్‌లకు ఉపయోగపడుతుంది.
స్పీకింగ్ ప్రాక్టీస్..
గూగుల్ సెర్చ్ ‘స్పీకింగ్ ప్రాక్టిస్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఉపకరించే ఈ ఫీచర్ ప్రస్తుతం ఇండియా, అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా, మెక్సికో, వెనిజులాలలో అందుబాటులో ఉంది. యూజర్‌లు ఏఐ–పవర్డ్ ఇంటర్‌యాక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్సర్‌సైజ్‌లలో పార్టిసిపేట్ చేయవచ్చు.
నథింగ్ ఫోన్ (2ఏ)..
సైజ్: 6.7 అంగుళాలు
రిఫ్రెష్ రేట్: 120 హెచ్‌జడ్
కలర్: డార్క్ బ్లూ
ర్యామ్: 8జీబి
స్టోరేజ్: 128జీబి
ఏఐ ఫీచర్స్:
వాల్‌పేపర్ జెనరేటర్,
చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్
ఇంపార్టెంట్, అర్జంట్ లేబుల్స్ క్రియేట్ చేయడానికి..
∙ జీమెయిల్. కామ్‌లోకి వెళ్లి కంపోజ్ మెయిల్ ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి.
∙ 3–డాట్ మెనూ ఐకాన్ (బాటమ్ రైట్ కార్నర్ మెయిల్ కంపోజ్ విండో) క్లిక్ చేయాలి.
∙ లేబుల్ ఆప్షను సెలెక్ట్ చేయాలి.
∙ న్యూ కస్టమ్ లేబుల్ క్రియేట్ చేయడానికి ‘క్రియేట్ న్యూ’ ఆప్షన్ క్లిక్ చేసి నేమ్ ఆఫ్ ది లేబుల్(అర్జంట్, ఇంపార్టెంట్)లోకి వెళ్లాలి.
∙ లేబుల్ క్రియేట్ అయిన తరువాత... ఇమెయిల్ రైట్ క్లిక్ చేయాలి. ఇంపార్టెంట్, అర్జంట్‌కు సంబంధించి మార్క్ చేయాలి. నెక్స్ట్ జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు స్పెసిఫిక్ లేబుల్ హైలెట్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment