నాడంతా బొక్కుడే!  | Sakshi
Sakshi News home page

నాడంతా బొక్కుడే! 

Published Fri, Apr 26 2024 6:32 AM

huge increase at welfare and development In these five years: AP

సాధారణ సేవలు విద్య, వైద్యం, నీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమానికి ఈ ఐదేళ్లలో పెద్దపీట 

బాబు ఐదేళ్ల కంటే వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.1.58 లక్షల కోట్లు ఎక్కువ  

సాధారణ సేవల వ్యయమూ బాబు కన్నా ఇప్పుడే రూ.1.38 లక్షల కోట్లు ఎక్కువ  

అప్పుడు, ఇప్పుడు దాదాపు ఒకే బడ్జెట్‌.. మరి అప్పుడు ఈ సంక్షేమం, అభివృధ్ధి ఏమైంది?

ఈ ఐదేళ్లలో భారీగా పెరిగిన సంక్షేమం, అభివృద్ధి పద్దు 

న్యాయ, పోలీసు, జైళ్లు, వికలాంగులు, వడ్డీలు, పెన్షన్‌ తదితర సాధారణ సేవల వ్యయం ఇప్పుడే ఎక్కువ 

ఆర్థిక సేవల వ్యయం కూడా వైఎస్‌ జగన్‌ హయాంలోనే రూ.40,508 వేల కోట్లు అధికం 

ఆర్థిక సేవలంటే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్, ఇంధన, పరిశ్రమలు, రవాణా వ్యయం  

 సీఎం జగన్‌ హయాంలో ఓ వైపు సంక్షేమం.. మరో వైపు అభివృద్ధికి పెద్ద పీట 

ఇంకో వైపు మూలధన వ్యయం బాబు ఐదేళ్లలో రూ.76,139 కోట్లు.. ఈ ఐదేళ్లలో రూ.87,634 కోట్లు   

అర్హులైన పేదలందరికీ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు నేరుగా బదిలీ 

మరో రూ.1.84 లక్షల కోట్లు నగదేతర బదిలీ ద్వారా పేదల సంక్షేమానికి వ్యయం 

మొత్తంగా డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.4.54 లక్షల కోట్ల వ్యయం  

అప్పుల వృద్ధిలో మాత్రమే బాబు ముందంజ

అప్పట్లో పెన్షన్‌ కావాలంటే ఎవరైనా మృతి చెందితేనే కొత్త వారికి మంజూరు 

జన్మభూమి కమిటీల సిఫార్సులు, లంచాలు ఉంటేనే పథకాలు 

ఈ ఐదేళ్లలో పైసా లంచం లేకుండా పథకాలు.. అర్హతే ప్రాతిపదిక  

మరోవైపు 17 మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల్లో, స్కూళ్లలో నాడు–నేడు 

ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, కొత్త నిర్మాణాలకు రూ.16 వేల కోట్లు వ్యయం 

రూ.25 వేల కోట్లతో కొత్తగా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండ్‌ కేంద్రాలు 

గ్రామాల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు 

రెండేళ్లు కోవిడ్‌ కష్టాలున్నా ఇప్పుడే నిజమైన సంక్షేమాభివృద్ధి   

అవ్వ : అయ్యా.. నా వయసు 63 ఏళ్లు.. పిల్లలు పట్టించుకోవట్లేదు.. సుగర్, బీపీ మందు బిళ్లలకు కూడా డబ్బుల్లేవు.. వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయించండి.. మీకు రుణపడి ఉంటాను. 
జన్మభూమి కమిటీ సభ్యుడు: ఏమే ముసల్దానా.. నీకు పింఛన్‌ కావాల్సి వచ్చిందా.. నువ్వు మాకు ఓటు వేశావో లేదో తెలీదు.. అయినా ఇప్పుడు నేను ఖాళీగా లేను. రేపు పొద్దున ఒకసారి కనిపించు. అప్పుడు చూద్దాం. 

అవ్వ : పొద్దుగాలే రమ్మన్నావుగా..వచ్చానయ్యా.. పింఛన్‌ ఇప్పించండయ్యా.. 
జన్మభూమి కమిటీ సభ్యుడు: మనూళ్లో ఇప్పటికే 14 మందికి పింఛన్‌ వస్తోంది. ఇంతకు మించి ఇవ్వడానికి వీలు లేదు. ఈ 14 మందిలో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో
నీ పేరు రాయిస్తా. ఈ చెట్టు ఆకులన్నీ మా ఇంటి ముందే రాలుతున్నాయి. రోజూ పొద్దున, సాయంత్రం వచ్చి ఊడ్చు. 

మహిళ: అన్నా.. ఇప్పటికే మీకు నాలుగు సార్లు అర్జీ ఇచ్చాను. ఈసారైనా ఇంటి స్థలం ఇచ్చేలా చూడండన్నా. 
జన్మభూమి కమిటీ సభ్యుడు: ఏం గట్టిగా మాట్లాడుతున్నావు.. రూపాయి ఖర్చు కాకూడదు కానీ పనులు కావాలంట.. నీకు స్థలం వస్తే నాకేంటి లాభం? మీటింగ్‌లు, మా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.. ఓ పది వేల రూపాయలు సర్దు. నీ పని అయ్యేలా నేను మాట్లాడుతా. 

రాష్ట్రంలో గత చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికీ అర్హత ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అందలేదు. ప్రతి పనికీ లంచం. గట్టిగా అడిగితే వేధింపులు. అలాగని రాష్ట్రంలో చెప్పుకోదగిన అభివృద్ధి ఏమైనా జరిగిందా.. అంటే మచ్చుకు అయినా కనిపించదు. బాబు ఐదేళ్ల పాలనలో, ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ పాలనలో బడ్జెట్‌ దాదాపు ఒకటే.అప్పుడు సంక్షేమమూ లేదు.. అభివృద్ధీ లేదు. ఇప్పుడు ఏక కాలంలో సంక్షేమాభివృద్ధి సాధ్యమైంది. ఇది ఎలా జరిగిందంటే ఒకటే సమాధానం.

అప్పుడంతా దోచుకో.. పంచుకో.. సిద్ధాంతం.
ఇప్పుడు నేరుగా ప్రజల ఖాతాల్లోకే డబ్బు జమ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల బడ్జెట్‌లో సామాజిక, ఆర్థిక, సాధారణ సేవలకు గత చంద్రబాబు హయాం కన్నా భారీగా వ్యయం చేశారు. తద్వారా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు రికార్డు స్థాయిలో నిధులు వెచ్చించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్‌ వ్యయం రూ.1.50 లక్షల కోట్లు ఉండగా, ఈ నాలుగేళ్ల ఆర్థిక సంవత్సరంలో కూడా బడ్జెట్‌ ఇంచుమించు అంతే. ప్రస్తుత ఆర్థిక ఏడాది నాటికి స్వల్పంగా రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌ పెరిగింది.

అయినా సరే అర్హులైన పేదలందరికీ సంక్షేమం అందిస్తూ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు.కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ఇటు రాష్ట్ర సొంత ఆదాయం, అటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గినప్పటికీ, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ నెరవేర్చారు. మరో పక్క ఆస్తుల కల్పనకు గత చంద్రబాబు ఐదేళ్లు కన్నా ఈ ఐదేళ్లలోనే ఎక్కువగా వ్యయం చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన గానీ, పోర్టులు.. ఎయిర్‌ పోర్టులు నిర్మించాలనే ఆలోచన గానీ, ప్రభుత్వ రంగంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేయాలనే ఆలోచన గానీ, గ్రామాల్లో రైతులతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన గానీ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేయలేదు. అయితే ఇవన్నీ  కోవిడ్‌ సంక్షభంలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో చేసి చూపించారు. కోవిడ్‌ కారణంగా బాబు హయాం కన్నా రాష్ట్ర రాబడులు తగ్గినప్పటికీ ఎక్కడా సంక్షేమం, అభివృద్ధి ఆగకుండా సమతుల్యతతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది.  

సామాజిక సేవలు ఇప్పుడే ఘనం 
ఐదేళ్ల బడ్జెట్‌ (ఒక నెల తక్కువ) ద్వారా సామాజిక సేవలకు గత చంద్రబాబు హయాం కన్నా సీఎం జగన్‌ భారీగా వ్యయం చేశారు. బాబు ఐదేళ్ల బడ్జెట్‌ ద్వారా సామాజిక సేవలకు చేసిన వ్యయం కన్నా ఐదేళ్ల సీఎం జగన్‌ హయాంలో రూ.1.58 లక్షల కోట్లు ఎక్కువగా వ్యయం చేశారు. సామాజిక సేవలంటే విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాల వ్యయం. ఐదేళ్ల బడ్జెట్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ గత బాబు ఐదేళ్ల కన్నా సాధారణ సేవలకు రూ.1.38 లక్షల కోట్లు ఎక్కువగా వ్యయం చేశారు. సాధారణ సేవలంటే న్యాయ, పోలీసు, జైలు, వికలాంగులు, వడ్డీలు, పెన్షన్‌ తదితర వ్యయాలు.

ఐదేళ్ల బడ్జెట్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ గత చంద్రబాబు హయాం కన్నా ఆర్థిక సేవలకు రూ.40,508 కోట్లు ఎక్కువ వ్యయం చేశారు. ఆర్థిక సేవలంటే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్, సహకారం, ఇంధన, పరిశ్రమలు, రవాణా తదితర వ్యయాలు. అలాగే గత ఐదేళ్ల బాబు బడ్జెట్‌ కన్నా సీఎం వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో ఆస్తుల కల్పన వ్యయం అంటే మూల ధన వ్యయం ఎక్కువగా చేశారు. బాబు ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.76,139 కోట్లు చేస్తే, సీఎం వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,634 కోట్లు చేశారు. ఈ లెక్కలన్నీ కాగ్‌ గణాంకాల ఆధారంగా స్పష్టమయ్యాయి.  

బాబుకు ఒక్క మంచి ఆలోచన రాలేదు 
ఒక పక్క పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే మరో పక్క గ్రామాల్లో, వార్డుల్లో ప్రజలకు వారి ముంగిటే ప్రభుత్వ సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అధికారంలోకి వచి్చన ఆరు నెలల్లోనే సీఎం జగన్‌ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సేవలు, పథకాలన్నీ ఆయా గ్రామ, వార్డుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాలు, వార్డుల్లో విలేజ్, పట్టణ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలు చేశారు. అనుభవం గల వాడినని చెప్పుకునే చంద్రబాబుకు ఇవన్నీ చేయాలనే ఆలోచన కూడా రాలేదు.

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగంలో ఒకేసారి రూ.8,480 కోట్ల వ్యయంతో 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఐదు మెడికల్‌ కాలేజీలు ఇప్పటికే ప్రారంభం కాగా, మిగతావి ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, కొత్త నిర్మాణాలకు నాడు–నేడు పేరుతో ఏకంగా రూ.16 వేల కోట్లు వ్యయం చేస్తున్నారు.

ప్రభుత్వ స్కూళ్లను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు మన బడి నాడు–నేడు పేరుతో మరో రూ.16 వేల కోట్లు వ్యయం చేస్తున్నారు. ఈ విధంగా చేయవచ్చనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదు. రాష్ట్రంలో రూ.25 వేల కోట్లతో కొత్తగా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండ్‌ కేంద్రాల నిర్మాణాలను సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టారు. 

నాడు దోపిడీపైనే బాబు ప్రత్యేక శ్రద్ధ 
చంద్రబాబు రూ.17,368 కోట్లతో 43 ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని శ్వేత పత్రంలో ప్రకటించి, ఐదేళ్లలో రూ. 68,293 కోట్లు వ్యయం చేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో దోపిడీ చేశారో స్పష్టం అవుతోంది. ఇందుకు అదనంగా నీరు–చెట్టు పేరుతో రూ.12 వేల కోట్లు విలువైన పనులను పార్టీ కార్యకర్తలకు నామినేషన్ల విధానంలో ఇచ్చి దోపిడీ చేశారు. సీఎం జగన్‌ ఐదేళ్లలో రూ.35,268 కోట్లతో వ్యయం చేసి ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. అప్పులు తేవడంలో మాత్రం గత చంద్రబాబు ప్రభుత్వం ముందంజలో ఉంది.

గత చంద్రబాబు పాలనలో అన్ని రకాల అప్పుల సగటు వార్షిక వృద్ధి 21.87 శాతం ఉండగా, ఈ ఐదేళ్ల సగటు వార్షిక వృద్ధి 12.13 శాతంగా ఉంది. సుమారు రూ.8,000 కోట్ల వ్యయంతో గ్రామాల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల కోసం ఏకంగా 22,435 భవనాల నిర్మాణాలను చేపట్టారు. ఇందులో 90 శాతం భవనాల నిర్మాణాలు పూర్తయ్యి ప్రారం¿ోత్సవాలు కూడా జరిగాయి. ఈ భవనాలన్నీ ఆయా గ్రామాలకు ఆస్తులుగా నిలిచిపోనున్నాయి. మరో పక్క కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు.

పదే పదే మూడు సార్లు సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబుకు గ్రామాల్లోనే ప్రజల చెంతకు పాలన అందించాలనే ఆలోచన గానీ, నగదు బదిలీ ద్వారా పేదలకు లంచాల్లేకుండా సంక్షేమం అందించాలనే ఆలోచన గానీ, పోర్టుల నిర్మాణం చేపట్టాలనే ఆలోచన గానీ ఎందుకు రాలేదు? 

నేడు అర్హతే ప్రామాణికం 
అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో నవరత్నాల పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే నగదు బదిలీ చేశారు. ఐదేళ్ల పాలనలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా నగదు బదిలీ చేశారు. నగదేతర బదిలీ ద్వారా మరో రూ. 1.84 లక్షల కోట్లు పేదలకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం కల్పించారు. అంటే అర్హులైన పేదల సంక్షేమానికి ఐదేళ్లలో ఏకంగా రూ.4.54 లక్షల కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో వ్యయం చేశారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటి నగదు బదిలీ పథకాలేమీ లేకపోగా, పేదలకు అందించే సాయంలో జన్మభూమి కమిటీలు, పచ్చ నేతలు కొంత కొట్టేశారు. ఆఖరికి వృద్ధులు, ఒంటరి మహిళలకు పెన్షన్‌ ఇవ్వాలంటే ఆ గ్రామంలో పెన్షన్‌ పొందుతున్న వారు మృతి చెందితేనే ఆ స్థానంలో కొత్త వారికి పెన్షన్‌ మంజూరు చేసే దౌర్భాగ్య పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం చేసింది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కూడా జన్మభూమి కమిటీల పేరుతో పార్టీ వారినే ఎంపిక చేయించారు తప్ప అర్హులా కాదా అనేది పట్టించుకోలేదు.

అయితే సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేశారు. పైసా లంచం లేకుండా పారీ్టలు, వివక్ష లేకుండా అర్హులైతే చాలు వారందరికీ పారదర్శకంగా పథకాల ప్రయోజనాలను అందించారు. పొరపాటున అర్హులెవరైనా పథకాలు అందక మిగిలిపోతే, అలాంటి వారి కోసం ఏడాదిలో రెండుసార్లు సమయం ఇచ్చి మరీ వారి చేత వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేయించి ప్రయోజనాలు అందించారు.

మహిళల పేరిట అర్హులైన పేదలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలను మంజూరు చేయించి నిర్మాణాలను చేపట్టారు. ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలను గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఇలా పారదర్శకంగా పేదలకు ప్రయోజనాలను అందజేయలేదు.

గ్రామాల్లో భవనాల నిర్మాణాలు   
గ్రామ సచివాలయ భవనాలు    9,585 
రైతు భరోసా కేంద్రాలు     7,436 
వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌    5,414  

Advertisement
Advertisement