ధోని, కోహ్లి అందమైన అమ్మాయిలుగా మారితే..? | Sakshi
Sakshi News home page

ధోని కుమారీ.. విరాట్‌ రాణి, మహీ ముత్తాత.. కోహ్లి తాత..!

Published Sun, May 14 2023 7:38 AM

Artist Abu Shahid Dhoni, Kohli Female Version Pictures Gone Viral - Sakshi

ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లీ ఉన్నట్టుండి అందమైన అమ్మాయిలుగా మారితే? ‘అదెట్లా సాధ్యమండీ’ అనే సౌండ్‌ రాకముందే– ‘ఇదిగో ఇట్లా’ అని ఆర్టిస్ట్‌ అబూ షాహిద్‌ ఏఐ టెక్నాలజీతో వారిని అందమైన అమ్మాయిలుగా మార్చాడు.

పనిలో పనిగా ఈ ఇద్దరు క్రికెట్‌ దిగ్గజాలను షాహిద్‌ ముసలోళ్లుగా కూడా మార్చాడు. ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. ఈ పోస్ట్‌లను లైక్‌ చేస్తూ నెటిన్లు  ‘కలయా నిజమా’ అంటూ కామెంట్లు చేశారు. 

ధోని, కోహ్లిలనే కాకుండా షాహిద్‌ మరికొంత మంది టీమిండియా క్రికెటర్లను కూడా అమ్మాయిలుగా మార్చాడు. శుభ్‌మన్‌ గిల్‌, యువరాజ్‌ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌, హార్ధిక్‌ పాండ్యా, శిఖర్‌ ధవన్‌, రిషబ్‌ పంత్‌.. ఇలా పలువురు స్టార్‌ క్రికెటర్లను షాహిద్‌ ఏఐ టెక్నాలజీతో అందమైన అమ్మాయిలుగా మార్చాడు. ఈ ఫోటోలు సైతం వైరల్‌ కావడంతో నెటిజన్లు ఒక్కొకరికి ఒక్కో అమ్మాయి పేరు పెట్టి తమ సరదా తీర్చుకున్నారు. షాహిద్‌ క్రికెట్‌ స్టార్‌లనే కాకుండా సినీ తారలను సైతం ఏఐ టెక్నాలజీతో అమ్మాయిలుగా మార్చాడు. ఆ ఫోటోలు కూడా నెట్టింట తెగ సందడి చేశాయి.   

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement