Sakshi News home page

ఐపీఎల్‌ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు

Published Wed, Apr 17 2024 8:56 AM

Buttler Sensational Century Rajasthan Scripts History In IPL Run Chase - Sakshi

#KKRvRR: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ పైచేయి సాధించింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ అజేయ శతకం(107) కారణంగా ఐపీఎల్‌-2024లో ఆరో విజయాన్ని అందుకుంది.

సొంతమైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన కేకేఆర్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. సునిల్‌ నరైన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌(56 బంతుల్లో 109) కారణంగా భారీ స్కోరు సాధించింది.

నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది కేకేఆర్‌. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ చివరి బంతి వరకు పట్టుదలగా పోరాడింది. నిజానికి 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్‌ స్కోరు 128/6. గెలవాలంటే చివరి ఆరు ఓవర్లలో 96 పరుగులు కావాలి.. రోవ్‌మన్‌ పావెల్‌తో కలిసి బట్లర్‌ ఈ క్లిష్టతర పరిస్థితి నుంచి రాజస్తాన్‌ను గట్టెక్కించాడు.

గెలుపు సమీకరణం 1 బాల్‌.. 1 రన్‌ ఉన్న తరుణంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ బట్లర్‌ ఏమాత్రం తడబడకుండా ఆవేశ్‌ ఖాన్‌ కలిసి సింగిల్‌ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి ఇలా రాజస్తాన్‌ విజయ దరహాసం చేయగా.. కేకేఆర్‌ నైరాశ్యంలో మునిగిపోయింది.

ఇక ఈ అద్భుతమైన గెలుపుతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. పదిహేడేళ్లుగా ఏ జట్టుకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించింది. రన్‌ ఛేజింగ్‌లో ఆరో వికెట్‌ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన తొలి జట్టుగా ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. అదే విధంగా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ అవతరించింది.

ఛేజింగ్‌లో ఆరో వికెట్‌ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన జట్లు
1. రాజస్తాన్‌ రాయల్స్‌- కేకేఆర్‌ మీద- 103 రన్స్‌- 2024, కోల్‌కతా.
2. ఆర్సీబీ- గుజరాత్‌ లయన్స్‌ మీద- 91 రన్స్‌- 2016, బెంగళూరు
3. చెన్నై- ముంబై మీద- 85 రన్స్‌- 2018, వాంఖడే, ముంబై
4. చెన్నై- సన్‌రైజర్స్‌ మీద- 78 రన్స్‌- 2018, వాంఖడే
5. ఢిల్లీ- గుజరాత్‌ లయన్స్‌ మీద- 76- 2017, కాన్పూర్‌.

కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు:
►టాస్‌: రాజస్తాన్‌.. బౌలింగ్‌
►కేకేఆర్‌ స్కోరు: 223/6 (20)
►రాజస్తాన్‌ స్కోరు: 224/8 (20)
►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై రాజస్తాన్‌ గెలుపు.

ఇవి కూడా చదవండి: #Pat Cummins: శెభాష్‌.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్‌ అన్నతో అట్లుంటది మరి..
#T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్‌, అగార్కర్‌ చర్చలు.. హార్దిక్‌ పాండ్యాకు నో ఛాన్స్‌!

Advertisement
Advertisement