బెంగళూరు క్రికెటర్‌ డానియల్‌ సామ్స్‌కు పాజిటివ్‌ | Sakshi
Sakshi News home page

బెంగళూరు క్రికెటర్‌ డానియల్‌ సామ్స్‌కు పాజిటివ్‌

Published Thu, Apr 8 2021 6:23 AM

RCB Daniel Sams tests positive for COVID-19 - Sakshi

చెన్నై: ఐపీఎల్‌ను కరోనా వైరస్‌ వదలడం లేదు. తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్‌ డానియెల్‌ సామ్స్‌ పాజిటివ్‌గా తేలాడు. ఆస్ట్రేలియాకు చెందిన అతను ఈనెల 3న భారత్‌కు వచ్చాడు. అప్పుడు చేసిన పరీక్షలో నెగెటివ్‌గా వచ్చింది. కానీ బుధవారం చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఆర్‌సీబీ ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ వైరస్‌ బారి నుంచి కోలుకున్నాడు. బుధవారం అతని నమూనాలను పరీక్షించగా నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. రేపు చెన్నై వేదికగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో బెంగళూరు తలపడుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement