కృష్ణమ్మ తీరం విజయహారం | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ తీరం విజయహారం

Published Wed, May 1 2024 9:36 AM

Vijayawada City Development with Rs.1,383 crores With YSRCP Govt

రూ.1,383 కోట్లతో విజయవాడ నగరరాభివృద్ధి

రికార్డు వేగంతో బెంజిసర్కిల్‌ జంట ఫ్లైఓవర్‌లు పూర్తి 

శరవేగంగా వెస్ట్‌ బైపాస్‌ నిర్మాణం పనులు 

ఇంద్రకీలాద్రిపై రూ.216.05 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు  

నగరానికి ఐకాన్‌గా అంబేడ్కర్‌ స్మృతి వనం 

పోర్టు నిర్మాణంతో అభివృద్ధి పరుగులు 

మెడికల్‌ కళాశాల నిర్మాణంతో కార్పొరేట్‌ తరహా వైద్యం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతోంది. విజయవాడను సుందరంగా తీర్చిదిద్దడంతో కృష్ణా నదీతీరం, దుర్గ గుడి, ప్రకాశం బ్యారేజీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంబేడ్కర్‌ స్మృతివనం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు మెగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, జగనన్న కాలనీలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మూలపాడు వద్ద బటర్‌ఫ్లై పార్కును అందంగా తీర్చిదిద్ది 150 రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. కొండపల్లి బొమ్మల పరిశ్రమ అంతరించిపోకుండా వాటి  తయారీదారులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. 

బందరులో అత్యధిక జనాభా ఆధారపడి పనిచేసే రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమకు ప్రోత్సాహం కలి్పస్తున్నారు. అక్కడి ప్రజల చిరకాల కోరిక పోర్టు నిర్మాణం కల నెరవేరనుంది. గిలకలదిండిలో మత్స్యకారులకు ఉపాధి కలి్పంచేందుకు హార్బర్‌ నిర్మాణం పూర్తి కావస్తోంది. మెడికల్‌ కళాశాల నిర్మాణం పూర్తయి 150 మంది విద్యార్థులతో తరగతులు జరుగుతున్నాయి. రుద్రవరంలో కృష్ణా యూనివర్సిటీ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకొని కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖ బీచ్‌ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణం కలి్పంచేందుకు బందరు బీచ్‌లో రిసార్ట్స్, పార్కులు, గేమ్‌ జోన్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

రహదారులు.. అదరహో 
విజయవాడ బెంజిసర్కిల్‌ జంట ఫ్లై ఓవర్‌లు అందుబాటులోకి  
కృష్ణా నదిపై రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి కావడంతో తప్పిన ముంపు సమస్య  
వెస్ట్‌ బైపాస్‌ పనులు వేగంగా సాగుతున్నాయి తూర్పు బైపాస్‌ ప్రతిపాదనలకు తుది రూపు
జాతీయ రహదారి మొత్తం 17,761 మీటర్ల పొడవున 18 రహదారుల డివైడర్లను హరిత హారాలుగా తీర్చిదిద్దారు.  
నగరంలో 16 పార్కులను అభివృద్ధి చేశారు. ఎయిర్‌పోర్టు కారిడార్‌కు రూ.17 కోట్లతో తుదిరూపు  
మిషన్‌ క్లీన్‌ కృష్ణా కింద నదీ తీరాన్ని శుభ్రం చేశారు. నగరంలోని ప్రధాన కాలువల్లో బోటింగ్‌కు సన్నాహాలు 
కనకదుర్గా నగర్‌ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన, రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులు ప్రారంభం  
ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో రూ.102 కోట్లతో డ్రెడ్జింగ్‌ పనులు   రూ.62 కోట్లతో మున్నేరు కాల్వల

ఆధునికీకరణ పనులు 
విజయవాడలో కాలువలపై రూ.31 కోట్లతో ఏడు బ్రిడ్జిల నిర్మాణం  
జిల్లాలో తొలి విడతలో 1.07 లక్షల మందికి ఇళ్లు మంజూరు..  
వాటిలో 14,935 ఇళ్ల నిర్మాణం పూర్తి  
కాల్వ గట్టు, ప్రభుత్వ స్థలాలు, రోడ్ల పక్కన నివాసం ఉండే వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయింపు   
పటేల్‌నగర్, ప్రకాష్‌నగర్, వడ్డెరకాలనీ, నందావరి కండ్రిక ప్రాంతాల్లో గతంలో 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్‌ చేశారు  
జలజీవన్‌ మిషన్‌ కింద 77,123 గృహాలకు నీరు అందించేందుకు రూ.77.9 కోట్లు ఖర్చు చేశారు  

అంబేడ్కర్‌ స్మృతివనం అద్భుతం
నగరాభివృద్ధికి చేసిన ఖర్చు – రూ.1,383 కోట్లు  
అంబేడ్కర్‌ స్మృతివనం కోసం చేసిన ఖర్చు–  రూ.400 కోట్లు 
ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు– రూ.239.19 కోట్లు 
జీజీహెచ్‌లో నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులకు– రూ.170 కోట్లు 
 సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ నిర్మాణం కోసం – రూ.150 కోట్లు 
 కృష్ణా నది రక్షణ గోడ నిర్మాణం కోసం చేసిన ఖర్చు – రూ.394.27 కోట్లు 
బెంజి సర్కిల్‌  మొదటి ఫ్లైఓవర్‌ పొడవు–  2.27 కి.మీ 
 దాని నిర్మాణానికి చేసిన ఖర్చు– రూ.80 కోట్లు 
 బెంజి సర్కిల్‌ రెండవ ఫ్లైఓవర్‌ పొడవు – 1.703 కి.మీ 
 దాని నిర్మాణానికి చేసిన ఖర్చు – రూ.96 కోట్లు 
బెంజిసర్కిల్‌ వెస్ట్, ఈస్ట్‌ సైడ్‌ సరీ్వస్‌ రోడ్లకు ఖర్చు చేస్తున్న మొత్తం : రూ.40 కోట్లు 
 గన్నవరం విమానాశ్రయం హాఫ్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం చేసిన ఖర్చు –రూ.23.75 కోట్లు  

ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ వైద్యసేవలు  
విజయవాడ జీజీహెచ్‌లో కార్డియోథోరాసిక్‌ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీ వంటి సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.150 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ నిరి్మంచారు. అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్, ఎంఆర్‌ఐ స్కాన్, 120 స్లైస్‌ సీటీ స్కాన్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే రూ.30 కోట్లు విడుదల చేశారు. రూ.170 కోట్లతో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు రూ.437 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలోని ఏ కొండూరు మండలంలోని గిరిజన తండాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగుల కోసం రూ.40 కోట్లతో  తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ఏ కొండూరు పీహెచ్‌సీలోనే డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి నెలా మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అర్హులైన వారికి రూ.10 వేల పింఛన్‌ ఇస్తున్నారు.  

పురోగతిలో బెజవాడ బైపాస్‌ పనులు ప్యాకేజీ–3 
  చిన్న అవుటుపల్లి –గొల్లపూడి పొడవు: 30 కి.మీ 
   దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం: రూ.1,148 కోట్లు ప్యాకేజీ–4 
    గొల్లపూడి–చినకాకాని – 17.88 కి..మీ 
    కృష్ణా నదిపై ఆరువరుసల బ్రిడ్జి పొడవు– 3.12 కి.మీ 
    దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం రూ.757 కోట్లు 
    ఈస్ట్‌ బైపాస్‌ ప్రతిపాదనలు 
   బైపాస్‌ పొడవు: 49.3 కి.మీ 
    కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జి పొడవు – 3.750 కి.మీ 
    అంచనా వ్యయం మొత్తం –రూ.4,607.80 కోట్లు   


 

Advertisement
Advertisement