బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం | Sakshi
Sakshi News home page

బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం

Published Tue, Apr 30 2024 3:58 PM

Ap: Bjp Distanced From The Alliance Manifesto

సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.

మోదీ, నడ్డా, అమిత్‌, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ   టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.

​మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం

Advertisement
Advertisement