30న జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలు | Sakshi
Sakshi News home page

30న జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలు

Published Mon, Sep 26 2016 11:30 PM

district wide drawing compitations

నరసాపురం: గాంధీ అధ్యయన కేంద్రం (యూజీసీ), నరసాపురం వైఎన్‌ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘మహాత్మాగాంధీ–మత సామరస్యం’ అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్టు స్థానిక వైఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కేవీసీఎస్‌ అప్పారావు, గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు కళాశాలలో పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 6వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలకు వచ్చేనెల 2న కళాశాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందిస్తామని చెప్పారు. వివరాలకు సెల్‌: 9849712739 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement