కొడుకు డేటింగ్‌పై తల్లి ఆందోళన! | Sakshi
Sakshi News home page

కొడుకు డేటింగ్‌పై తల్లి ఆందోళన!

Published Mon, Jan 25 2016 9:37 AM

కొడుకు డేటింగ్‌పై తల్లి ఆందోళన!

లండన్‌: ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బేక్‌హమ్‌, ఫ్యాషన్ ఐకాన్ విక్టోరియా బేక్‌హామ్‌ దంపతుల పెద్ద కొడుకు బ్రూక్లిన్ అప్పుడే ప్రేమలో మునిగిపోయాడు. 16 ఏళ్ల ఈ కుర్రాడు ఫ్రెంచ్ మోడల్ సొనియా బెన్‌ అమ్మర్‌ (16)తో డేటింగ్ చేస్తున్నాడు. బీచ్‌లో వారిద్దరు ప్రణయసల్లాపాలు సాగిస్తున్న ఫొటోలను తాజాగా బ్రూక్లిన్‌ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. అంతేకాకుండా 'ద ఫిఫ్త్ వేవ్‌' నటి కోల్‌ గ్రేస్‌ మోరెట్జ్‌ తోనూ సన్నిహితంగా ఉంటున్నాడు.

ఈ భామ గతవారం లండన్‌లో తన సినిమా ప్రమోషన్‌కు వచ్చినప్పుడు ఈ ఇద్దరు కలుసుకున్నారు. సహజంగానే తన కొడుకు డేటింగ్ వ్యవహారం తల్లి విక్టోరియాకు ఆందోళన కలిగిస్తున్నదని డేవిడ్‌ పేర్కొన్నాడు. 'వయస్సులో చిన్నవాడైన కొడుకు బయటకు వెళ్లి డేటింగ్ చేయడాన్ని చూడటం నా కన్నా తల్లికే కష్టంగా ఉంది' అని ఓ టీవీ షోలో ఆయన పేర్కొన్నాడు. తమ కూతురు పెద్దదై.. తను కూడా డేటింగ్ చేస్తుందన్న ఆలోచనే తమకు భరించడం కష్టంగా ఉందని ఆయన అన్నాడు. అప్పటికీ తమ దృక్పథంలో మార్పు రావచ్చునని చెప్పాడు.

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement