అభివృద్ధి బటన్‌ నొక్కిన సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

అభివృద్ధి బటన్‌ నొక్కిన సీఎం జగన్‌

Published Wed, Apr 24 2024 12:38 AM

Industrail Sector Development In Andhra pradesh - Sakshi

పారిశ్రామిక రంగం రయ్‌ రయ్‌

పెట్టుబడులు ఏకీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరణ 

విశాఖ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ 

జగన్‌ ఐదేళ్ల పాలనలో వాస్తవ రూపంలోకి రూ.78,514 కోట్ల పెట్టుబడులు  

చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున రూ.11,994 కోట్లు 

జగన్‌ పాలనలో ఏడాదికి సగటున రూ.15,702.8 కోట్లు 

ఇవి కాకుండా వేగంగా పనులు జరుగుతున్న రూ.223 లక్షల కోట్ల పెట్టుబడులు 

ఇన్ఫోసిస్, రాండ్‌స్టా్టండ్, బీఈఎల్, విప్రో వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు..

ఐదేళ్లలో 1.01 లక్షల మందికి ఉపాధి..  నిర్మాణంలో ఉన్న వాటి ద్వారా మరో 1.62 లక్షల మందికి లభించనున్న ఉపాధి 

చంద్రబాబు దిగిపోయేనాటికి 27,643 మంది ఐటీ ఉద్యోగులు..

గత ఐదేళ్లలో 75,551కు పెరుగుదల.. 161 నుంచి 586కు పెరిగిన స్టార్టప్‌లు  

ఈ 5 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల్లో రూ.78,514 కోట్ల పెట్టుబడులు

బాబు హయాంలో రూ.59,970 కోట్లు మాత్రమే 

కరోనా నష్టాల్ని అధిగమించి మరీ రాష్ట్రంలో పరిశ్రమలకు సీఎం జగన్‌ పట్టం 

386 ఒప్పందాలతో రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులకు జగన్‌ ప్రభుత్వం ఒప్పందాలు 

ఏడాదిలోపే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపం 

గత ప్రభుత్వంలో రూ.19 లక్షల కోట్ల పెట్టుబడులంటూ ఊదరగొట్టిన చంద్రబాబు 

3 శాతం కూడా తీసుకురాలేక అభాసుపాలు 

మూడు పారిశ్రామిక కారిడార్లతో మారనున్న రాష్ట్ర రూపురేఖలు 

అంబానీ, అదానీ, బిర్లా, మిట్టల్, సంఘ్వీ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో భారీ ఒప్పందాలు 

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ వేసిన అడుగులు చక్కటి ఫలితాలిచ్చాయి. ప్రధానంగా పారిశ్రామికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. ఎలాంటి హడావుడి లేకుండా అన్ని ప్రాంతాలకు భారీ పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా, అవి ఉత్పత్తిని ప్రారంభించేలా అన్ని విధాలా ఊతమందించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా టాటాలు, బిర్లాలు, అదానీ, అర్సెలర్‌ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్‌ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో పాటు విదేశీ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి.

ఉత్తరాంధ్రలోని అచ్యుతాపురం వద్ద జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్‌ (అలయన్స్‌ టైర్స్‌ గ్రూపు), అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, లారస్‌ ల్యాబ్‌ వంటి దిగ్గజ సంస్థలు,  విజయనగరంలో శారడా మెటల్స్‌ ఉత్పత్తిని ప్రారంభించాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

కోస్తాంధ్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్, కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సులిన్‌ తయారీ సంస్థ లూఫిస్‌ ఫార్మా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఐటీసీ స్పైసెస్‌ పార్కు, పిడుగురాళ్ల వద్ద శ్రీ సిమెంట్స్, నెల్లూరు జిల్లాలో ఇండోసోల్‌ సోలార్‌ ప్యానల్స్‌ తయారీ, క్రిభ్‌కో ఇథనాల్, గ్రీన్‌లామ్‌ సొల్యూషన్స్, గోకుల్‌ ఆగ్రో ప్రారంభం అయ్యాయి. రాయలసీమలోని చిత్తూరులో బ్లూస్టార్, డైకిన్, హావెల్స్, యాంబర్, ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్స్, టీసీఎల్, వైఎస్సార్‌ జిల్లాలో డిక్సన్, సెంచురీ ప్లేవుడ్స్, బిర్లా గార్మెంట్స్, కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌ వంటి భారీ పెట్టుబడులు వచ్చాయి.   

► చంద్రబాబు ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.59,970 కోట్లు 
►ఈ 5 ఏళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల్లో రూ.78,514 కోట్ల పెట్టుబడులు
►వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాలేదంటూ ఎల్లో మీడియాతో కుట్ర చేసిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. 
►తప్పుడు సమాచారంతో యువతను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే చంద్రబాబు అండ్‌ కోకు ఈ వాస్తవాలు కనిపించవా... 
►సంక్షేమంతో పాటు సమానంగా పరిశ్రమలకు అగ్రతాంబూలం ఇస్తే నీచమైన రాతలా.. – చంద్రశేఖర్‌ మైలవరపు, సాక్షి, అమరావతి 

ఇదీ జగన్‌ అంటే.. 
 ►గత ప్రభుత్వంలా ఏటా పెట్టుబడుల సదస్సు అంటూ హడావుడి చేయలేదు. ఒక్కసారి మాత్రమే 2023లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించగా.. 386 ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఏ రాష్ట్ర పెట్టుబడుల సదస్సుకు రాని రిలయన్స్‌ గ్రూపు అధినేత ముఖేష్‌ అంబానీ స్వయంగా విశాఖ రావడమే కాకుండా రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఐదేళ్లలో బిర్లాలు, అదానీ, మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్‌ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి విచ్చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.
► సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయి. మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది తిరక్కుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి.  

ఎంఎస్‌ఎంఈలకు పునరుజ్జీవం 
కోవిడ్‌ సమయంలో రీస్టార్‌ ప్యాకేజీ, వైఎస్సార్‌ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్‌ఎంఈలు మళ్లీ ఊపిరిపోసుకున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలతో ఆదుకుంటోంది. గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్‌ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీ పడేలా క్లస్టర్‌ విధానాన్ని, ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రూ.118 కోట్లతో జగన్‌ ప్రభుత్వం   ర్యాంప్‌ కార్యక్రమం చేపట్టింది. చంద్రబాబు సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530 ఎంఎస్‌ఎంఈలు ఉంటే.. ఇప్పుడు ఏడు లక్షలు దాటాయని ఉద్యమ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పారిశ్రామిక కారిడార్లతో రాష్ట్రం రికార్డులు 
పరిశ్రమలకు అన్ని రకాల మౌలికవసతులు ఒకే చోట లభించేలా మూడు పారిశ్రామిక కారిడార్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మూడు పారిశ్రామిక కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది.  
►విశాఖ–చెన్నై కారిడార్‌(వీసీఐసీ) 
►చెన్నై–బెంగళూరు కారిడార్‌ 
►హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్‌.. ఈ మూడూ అభివృద్ధి దశలో ఉన్నాయి. 

చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌  
ఇందులో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌గా రూపుదిద్దుకుంటోంది. తిరుపతి జిల్లాలోని 2,500 ఎకరాల్లో క్రిస్‌ సిటీ ఏర్పాటు కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలి్పస్తోంది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు, 14 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.  

విశాఖ–చెన్నై కారిడార్‌(వీసీఐసీ) 
విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా రెండు గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ నోడ్‌లు తీర్చిదిద్దారు. విశాఖపట్నంలోని నక్కపల్లి–రాంబిల్లి క్లస్టర్లు, చిత్తూరు నోడ్‌లో ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో అంతర్గత మౌలిక సదుపాయాలు కల్పించారు. వీసీఐసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్‌టర్నల్‌ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్‌ జోన్‌లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్‌ జోన్‌లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేశారు.

నాయుడుపేటలో 276 పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,051 కోట్ల పెట్టుబడులతో 9,030 ఉద్యోగాలు కల్పించారు. అచ్యుతాపురంలో మొత్తం  2,272 పరిశ్రమల ఏర్పాటుతో రూ.12,381 కోట్ల పెట్టుబడులు రాగా 60 వేల మందికి ఉద్యోగాలు లభించాయి.

► వీసీఐసీలో భాగంగా వైఎస్సార్‌ జిల్లాలోని కొప్పర్తిలో 6,740 ఎకరాలలో పరిశ్రమల హబ్‌ తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. కొప్పర్తి కేంద్రంగా మోడల్‌ ఇండ్రస్టియల్‌ పార్కు, ఎంఎస్‌ఈ సీడీపీ, వైఎస్సార్‌ ఈఎంసీ, వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండ్రస్టియల్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.2595.74 కోట్ల నిక్‌డిక్ట్‌ నిధులతో అభివృద్ధికి కార్యాచరణ రూపొందించారు. అక్కడ 66 పరిశ్రమలు కొలువుదీరాయి. ప్లగ్‌ అండ్‌ ప్లే పరిశ్రమల కోసం ఇప్పటికే షెడ్ల నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.1,875.16 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలిచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది.  

హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ 
ఈ కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు.  

చంద్రబాబు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా
► పెట్టుబడుల సదస్సు అంటూ గత ప్రభుత్వం రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయని ఎల్లో మీడియాలో ఊదరగొట్టేశారు. కనీసం అందులో 10 శాతం పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోయేది. బాబు హయాంలో కనీసం 5 శాతం పెట్టుబడులు కూడా రాలేదు. దీనిపై మీ ఎల్లో మీడియాలో రాయించగలవా.. 

►బాబు హయాంలో కేంద్ర సహకారం అందినా.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అనుభవం ఉన్నా.. పెట్టుబడుల ప్రవాహానికి అనుకూల వాతావరణం ఉన్నా..  తన సొంత అజెండాతో పారిశ్రామిక ప్రగతిని బాబు నిర్లక్ష్యం చేశారు. జగన్‌ అధికారంలోకి రాగానే పరిశ్రమలకు పట్టం కడుతున్న వేళ.. కోవిడ్‌ లాక్‌డౌన్‌తో రెండేళ్లు ప్రపంచమంతా పడకేసింది. అయినా జగన్‌ గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు.  

►జగన్‌ పాలనలో రాష్ట్రంలో 163 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.78,514  పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. ఉత్పత్తి ప్రారంభించాయి. బాబు హయాంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు పెడితే.. జగన్‌ హయాంలో ఏటా రూ.15,702.8 కోట్ల పెట్టుబడులు పెట్టారు.  

వివిధ దశల్లో రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులు 
ఒప్పందం జరిగిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. అదనంగా దావోస్‌ పర్యటనలో మరో రూ.1,26,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా యువతకు 38 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో మీకు నేను ఉన్నానంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఇచ్చిన అభయం వారి నమ్మకాన్ని రెట్టింపు చేసింది. గత మూడేళ్ల నుంచి పూర్తిగా 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 

6 లక్షల మందికిపైగా ఉపాధి  
ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ద్వారా రాష్ట్రంలో 6 లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తోంది. ఎంఎస్‌ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్‌ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశారు. ఇందుకు ప్రతి జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల్ని అందించేలా మరో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో మరో టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖలో టెక్నాలజీ సెంటర్‌ కొనసాగుతోంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో ఈ టెక్నాలజీ సెంటర్‌ అభివృద్ధి చేస్తున్నారు.  

బంధం కొనసాగిస్తాం 
ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టిన తాము భవిష్యత్తులో కూడా అదే బంధాన్ని కొనసాగిస్తాం. ఇందులో భాగంగా 10 గిగావాట్ల రెన్యువబుల్‌ సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా రాష్ట్రంలో 1.20 లక్షల మంది కిరాణా వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాం. 6,000 గ్రామాల్లో సేవలు అందిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా రాష్ట్రంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలి్పస్తున్నాం. – ముఖేశ్‌ అంబానీ 

రెండు నెలల్లో రెండు యూనిట్లు  
ఆదిత్య బిర్లా గ్రూపు ద్వారా రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేశాం.  వైఎస్సార్‌ జిల్లాలో గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఆరు వ్యాపారాల్లో 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.   – కుమార్‌ మంగళం బిర్లా 

అర నిమిషంలోనే ఒప్పించారు 
మే నెలలో సీఎం జగన్‌ను కలిసి 30 సెకన్లు మాత్రమే మాట్లాడా. ఈ సందర్భంగా మా అబ్బాయి బయో ఇథనాల్‌ ప్లాంట్‌ స్థాపనకు వివిధ రాష్ట్రాలు పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహా్వనించారు. బయో ఇథనాల్‌ పాలసీని యూనిట్‌ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. –సీపీ గుర్నానీ, సీఈవో, టెక్‌ మహీంద్రా 

రాష్ట్రం వైపు ఐటీ దిగ్గజ సంస్థల చూపు 
దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రంలో తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఇన్ఫోసిస్, విప్రో, రాండ్‌స్టా్టండ్, బీఈఎల్, అమెజాన్‌ డీసీ వంటి అనేక దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. బీపీఓ కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన విశాఖ నగరం.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఇన్ఫోసిస్‌ రాష్ట్రంలో తొలి డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడంతో.. విప్రో కూడా సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. విశాఖ అనగానే పల్సస్‌ గ్రూపు, డబ్ల్యూఎన్‌ఎస్, టెక్‌ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు బీచ్‌ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఆకర్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.   

ఐటీ హబ్‌గా విశాఖ 
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలోని ఐటీ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643గా ఉంది. అందులో సగం మందికి ఉద్యోగాలు దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో వచ్చినవే. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఐదేళ్ల కాలంలో కొత్తగా 47,908 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 75,551కు చేరుకుంది.

స్టార్టప్స్‌ కూడా 161 నుంచి 586కు చేరాయి. స్టార్టప్స్‌లో 2019 నాటికి 1,552 మంది పనిచేస్తుంటే ఇప్పుడు ఆ సంఖ్య 55,669కు చేరింది. ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) చెబుతున్నవే. తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ‘కల్పతరువు’తో పాటు నాస్కామ్‌ సహాయంతో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటు చేశారు.  ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్‌ జోన్‌లోనూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. 

పెట్టుబడుల ఆకర్షణలో ముందు వరుస 
పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్‌కమ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను ప్రారంభించాం. ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్‌ ప్రారంభిస్తున్నాం. –  సంజయ్‌ పూరి, ఐటీసీ సీఈవో 

Advertisement

తప్పక చదవండి

Advertisement