Weekly Horoscope in Telugu: 13-08-2023 To 19-08-2023 - Sakshi
Sakshi News home page

Weekly Horoscope Telugu: ఈ వారంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి

Published Sun, Aug 13 2023 7:00 AM

Weekly Horoscope Telugu 13-08-2023 To 19-08-2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు. పసుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, లేత గులాబీ రంగులు. కనకధారాస్తోత్రం పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వాహనయోగం.  వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి సమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యస్తుతి మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వ్యవహారాలలో  విజయం సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో కుటుంబసమస్యలు. ఆరోగ్యభంగం. తెలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి. 

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనులు క్రమేపీ పుంజుకుంటాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కొంటారు. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో శ్రమ పెరుగుతుంది. నీలం, ఆకుపచ్చ రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే కాస్త మెరుగుపడుతుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.  శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి అవార్డులు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. నేరేడు,పసుపు రంగులు.  అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఇంటాబయటా మీకు అనుకూల పరిస్థితి ఉంటుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. పసుపు, లేత ఆకుపచ్చరంగులు, ఆంజనేయస్వామిని పూజించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో ఖర్చులు అధికం. ఎరుపు, చాక్లెట్‌ రంగులు, గణపతి అర్చన మంచిది. 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట్లో నెలకొన్న సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.  వారం చివరిలో శ్రమ వృథా కాగలదు. గులాబీ, తెలుపురంగులు, శివపంచాక్షరి పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న సమయానికి డబ్బు  సమకూరి అవసరాలకు ఆదుకుంటుంది. మీపై వచ్చిన కొన్ని ఆరోపణలు తొలగుతాయి. స్థిరాస్తి విషయంలో  సమస్యలు తీరతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభించవచ్చు. వివాహాది శుభకార్యాలపై ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాల మేరకు బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు కృషి ఫలిస్తుంది. కాఫీ, నీలం రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఎటువంటి నిర్ణయమైనా భయపడకుండా తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవర్గాల యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం  ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చిక్కులు. ఎరుపు, గోధుమ రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

Advertisement
Advertisement