Air India Record Order For About 500 Jets From Airbus, Boeing - Sakshi
Sakshi News home page

ఎయిరిండియా చరిత్రలో ఎన్నడూ లేని భారీ డీల్.. లక్షల కోట్లతో..

Published Sat, Feb 11 2023 7:34 PM

Air India Record Order For About 500 Jets From Airbus, Boeing - Sakshi

ప్రముఖ దేశీయ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిరిండియా మకుటంలో మరో కలికితురాయి చేరుకోనుంది. ఎయిరిండియా బ్రాండ్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్‌ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్‌ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్‌ క్రాప్ట్‌లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్‌ కథనం వెలువరించింది.  

ఇప్పటికే గత డిసెంబర్‌ నెలలో ఎయిరిండియా భారీ ఎత్తున విమానాల్ని కొనుగోలు చేస్తున్నట్లు అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ కథనాలకు కొనసాగింపుగా వచ్చే వారంలో విమానాల కొనుగోలుపై ఎయిరిండియా ప్రకటన చేయనున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. 

పలు నివేదికల ప్రకారం.. 500 ఎయిర్‌ క్రాఫ్ట్‌లలో ఫ్రాన్స్‌ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ నుంచి 210 సింగిల్‌ ఐస్లె (asile) ఏ320నియోస్‌, 40 వైడ్‌ బాడీ ఏ 350ఎస్‌లను, అమెరికా ఎయిర్‌క్ట్రాఫ్ట్‌ తయారీ సంస్థ బోయింగ్‌ నుంచి  220 ఫ్లైట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో 190 737 మ్యాక్స్‌ న్యారో బాడీ జెట్స్‌ 20  787 వైడ్‌ బాడీ, 10 777ఎక్స్‌లను కొనుగులుకు ఆర్డర్‌ ఇచ్చింది. 

ఎయిర్‌బస్- ఎయిరిండియా విమానాల కొనుగోళ్లపై నిన్ననే ( ఫిబ్రవరి 10న) ఒప్పందంపై సంతకం చేయగా..బోయింగ్ జనవరి 27న ఎయిర్‌లైన్‌తో తన ఒప్పందాన్ని అంగీకరించింది. జనవరి 27న ఉద్యోగులకు రాసిన నోట్‌లో ఎయిర్‌లైన్  కొత్త విమానాల కొనుగోళ్ల కోసం చారిత్రాత్మకమైన ఆర్డర్‌ ఖరారు చేస్తున్నట్లు తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement