Apple iPhone14 Expected Specifications, Features Price Leaks Online - Sakshi
Sakshi News home page

Apple iPhone 14: ధరలు,స్పెసిఫికేషన్స్‌, లేటెస్ట్‌ లీక్స్‌

Published Wed, Sep 7 2022 5:18 PM

Apple iPhone14 expected specifications features price latest leaks - Sakshi

న్యూఢిల్లీ:ఆపిల్‌ అతిపెద్ద వార్షిక ఫార్ అవుట్ ఈవెంట్‌లో  నాలుగు కొత్త ఐఫోన్‌లను-ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్లస్‌ మోడలల్స్గా లాంచ్‌ చేయనుందని  ఊహాగానాలున్నాయి. అయితే ఈ ఫోన్లకు  సంబంధించి ధరలు,స్పెసికేషన్స్‌పై  చైనీస్ సోషల్ వెబ్‌సైట్‌లో  తాజా లీక్స్‌ ఆసక్తికరంగా మారాయి. 

ఐఫోన్‌ 14 ప్రొ మాక్స్‌ : 458ppi పిక్సెల్ డెన్సిటీ  1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 2778×1244 రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను లాంచ్‌ కానుంది.  48ఎంపీ 8కే కెమెరా, 4323 mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. 

ధరలు అంచనాలు: 256 జీబీ మోడల్ రూ. 1,25,525, 512 జీబీ వేరియంట్ రూ. 1,42,801 , 1 టీబీ మోడల్ రూ. 1,60,005గా ఉంటుందని అంచనా.

ఐఫోన్‌ 14 ప్రొ:  6.1-అంగుళాలు  డిస్‌ప్లే , 2532×1170 రిజల్యూషన్ 3200mAh బ్యాటరీతో లాంచ్‌ కానుంది.

ధరలు అంచనాలు: 256జీబీ మోడల్ ధర రూ. 1,14,011, 512 జీబీ ధర రూ. 1,31,284 . 1టీబీ  వేరియంట్ ధర రూ. 1,49,711 ఉండవచ్చని అంచనా.

ఐఫోన్ 14 ప్లస్:  1000నిట్స్ బ్రైట్‌నెస్‌తో ట్రూ టోన్‌ P3 డిస్‌ప్లేతో వస్తోందట. 12ఎంపీ 4కే  కెమెరా 4325mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.

ధరలు అంచనాలు: 128జీబీ ధర రూ. 85,219, 256జీబీ రూ. 93,297 , 512 జీబీ ధర రూ. 1,04, 817గా ఉండనుంది. 

ఐఫోన్ 14: 6.1 అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చనిఅంచనా. అలాగే  173గ్రా బరువుతో 3279mAh బ్యాటరీతో వస్తోందట.

ధరలు అంచనాలు
బేస్ మోడల్‌ధర దాదాపు రూ. 77,112గా ఉండనుంది.  256జీబీ మోడల్‌ ధర రూ. 85,169,  512 జీబీ  వేరియంట్‌కు రూ. 1,04,817గా ఆపిల్‌ నిర్ణయించిదట. అయితే  అధికారిక లాంచింగ్‌ వరకు  ఐఫోన్‌  మోడల్స్‌,  ఫీచర్లు ధరలపై సస్పెన్స్‌ తప్పదు.

ఇది చదవండి: iPhone 14: మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్‌ కుక్‌ సర్‌ప్రైజ్‌ చేస్తారా?

Advertisement
 
Advertisement
 
Advertisement