రిస్క్‌ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్‌బీఐ | Sakshi
Sakshi News home page

రిస్క్‌ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్‌బీఐ

Published Tue, Mar 5 2024 12:54 PM

Credit Card Debts Increase On January 2024 - Sakshi

దేశంలో క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. జనవరిలో క్రెడిట్‌కార్డ్‌ రుణాలు ఏకంగా 31.3 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. అన్‌సెక్యూర్డ్‌ రుణాలపై రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) రిస్క్‌ వెయిటేజీ పెంచినప్పటికీ, బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి.

2024 జనవరి నెలలో బ్యాంక్‌లు క్రెడిట్‌ కార్డులపై ఇచ్చిన రుణాలు 31.3 శాతం పెరిగి రూ.2.6 లక్షల కోట్లకు చేరాయి. 2023 డిసెంబర్‌లో ఇవి రూ.2.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ క్రెడిట్‌ కార్డ్‌ వార్షిక వినియోగం 26.3 శాతం వృద్ధి చెందింది.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో రిటైల్‌ అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ (వ్యక్తిగత రుణాలు) శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా ఆర్థిక స్థిరత్వం రిస్క్‌లో పడుతుందని ఆర్బీఐ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చే తనఖాలేని వినియోగ రుణాలపై గత ఏడాది నవంబర్‌లో రిస్క్‌ వెయిట్‌ను 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. అంటే వాటిపై ఆర్థిక సంస్థలు అధిక కేటాయింపులు జరపాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. రాధిక గురించి ఆసక్తికర విషయాలు..

దీంతో వ్యక్తిగత రుణాల వృద్ధి డిసెంబర్‌లో 26.6 శాతం ఉండగా, జనవరిలో 23.3 శాతానికి తగ్గింది. కానీ క్రెడిట్‌ కార్డు రుణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

Advertisement
Advertisement