ఆధార్‌ కార్డ్‌ దారులకు ముఖ్యగమనిక.. త్వరలో ముగియనున్న డెడ్‌లైన్‌! | Free Aadhaar Update Deadline To End On March 14 This Year - Sakshi
Sakshi News home page

Free Aadhaar Update Deadline: ఆధార్‌ కార్డ్‌ దారులకు ముఖ్యగమనిక.. త్వరలో ముగియనున్న డెడ్‌లైన్‌!

Published Fri, Feb 9 2024 7:13 PM

Free Aadhaar Update Deadline To End On March 14 - Sakshi

ఆధార్‌ కార్డ్‌ దారులకు ముఖ్య గమనిక. ఆధార్‌లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉచితంగా చేసుకునేందుకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఈ ఏడాది మార్చి 14తో ముగియనుంది. ఈ తేదీలోపే ఏమైనా మార్పులు చేసుకోవాలని ఆధార్‌ ప్రతినిధులు కోరుతున్నారు. 

2023 డిసెంబర్‌లో మూడు నెలల పాటు పొడిగించబడిన ఉచిత ఆధార్ అప్‌డేట్ మార్చి 14, 2024కి ముగియనుంది. ఈ గడువు గతంలో చాలాసార్లు పొడిగించింది కేంద్రం. మార్చి 14 తర్వాత ఈ గడువు పొడిగిస్తుందా?లేదా? అనేది తెలియాల్సి ఉంది.  

ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు: మార్చి 14, 2024 (ఇది చివరి పొడిగింపు)

ఎవరు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు: ఇప్పటికే తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయని వారు ఎవరైనా

ఏ వివరాల్ని ఆధార్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు: పేరు, చిరునామా,మొబైల్ నంబర్ వంటి జనాభా వివరాలు (బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు ఇప్పటికీ ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం అవసరం)

మార్చి 14 తర్వాత ఏం జరుగుతుంది: ఆధార్ అప్‌డేట్‌ల కోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.  

మీ ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే 

♦ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://myaadhaar.uidai.gov.in/

♦ మీ ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయండి.

♦ ‘సెండ్‌ ఓటీపీ’ ఆప్షన్‌ మీద క్లిక్ చేసి మీ నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన కోడ్‌ను ఎంటర్‌ చేయండి

♦ అనంతరం అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆప్షన్‌పై ట్యాప్‌ చేయండి.  

♦ ఇక్కడే మీరు ఆధార్‌లో ఏం మార్పులు చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. సంబంధిత కాలమ్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.  

♦ అవసరమైన మార్పులను చేయండి, ఇందుకోసం అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

♦ సంబంధిత వివరాలను నమోదు చేసి రిక్వెస్ట్‌పై క్లిక్‌ చేయండి.

Advertisement
Advertisement