జియో గుడ్‌న్యూస్‌.. ఆ కస్టమర్లే టార్గెట్‌! | Sakshi
Sakshi News home page

జియో గుడ్‌న్యూస్‌.. ఆ కస్టమర్లే టార్గెట్‌!

Published Mon, Oct 30 2023 5:15 PM

Jio wont raise tariff crores of customers will get big benefit - Sakshi

దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio).. కోట్లాది మంది టెలికం కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 5జీ ప్లాన్‌లు విస్తరిస్తున్నప్పటికీ టారిఫ్‌లు మాత్రం పెంచబోమని హామీ ఇచ్చింది. దేశంలోని మిగతా అన్ని టెలికమ సంస్థల కంటే తమ రీచార్చ్‌ ప్లాన్‌లు చవగ్గానే ఉంటాయని వెల్లడించింది. 

అసలు టార్గెట్‌ వారే..
టెలికం పరిశ్రమలో రిలయన్స్‌ జియో దూకుడును మరింత పెంచింది. రానున్న రోజుల్లో 5జీ ప్లాన్‌లపైన కూడా టారిఫ్‌లను పెంచబోమని ప్రకటించింది. అయితే దీని వెనుక అసలు టార్గెట్‌  వేరే ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న 24 కోట్ల మందికిపైగా ఎయిర్‌టెల​్‌, వొడాఫోన్‌ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌/ఎమ్‌టీఎన్‌ఎల్‌ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "సరసమైన టారిఫ్‌లు" ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది.

 

అంబానీల దృష్టి కూడా అదే..
జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ మాట్లాడుతూ.. కంపెనీ టారిఫ్‌లను నాటకీయంగా పెంచాలని భావించడం లేదని, యూజర్లు ఇంటర్నెట్-హెవీ, డేటా ప్లాన్‌లకు మారుతున్న నేపథ్యంలో కస్టమర్లను మరింత పెంచుకోవడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీల దృష్టి కూడా అదేనని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి

Advertisement

తప్పక చదవండి

Advertisement