Top 5 Best Smartphones Under 35000 in India - Sakshi
Sakshi News home page

Top 5 Best Smartphones Under 35000: మంచి స్మార్ట్​ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!

Published Sun, Jul 9 2023 5:25 PM

Top 5 best smartphones under 35000 Realme Motorola and more - Sakshi

Best Smartphones Under 35000: దేశీయ విఫణిలో రోజురోజుకి కొత్త స్మార్ట్​ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే చాలా మంది కొంత తక్కువ ధర కలిగిన బెస్ట్ అండ్ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. భారతీయ మార్కెట్లో రూ. 35,000 కంటే తక్కువ ధర వద్ద మొబైల్ కొనాలని చూస్తున్న వారు ఈ బెస్ట్ స్మార్ట్​ఫోన్స్​ చూడవచ్చు. ఇందులో రియల్​మీ, మోటోరోలా, పోకో బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రియల్​మీ 11 ప్రో ప్లస్..
ప్రస్తుతం చాలామంది కొనుగోలుదారులు రియల్​మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మన జాబితాలో రూ. 35,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్​ఫోన్స్ జాబితాలో 'రియల్​మీ 11 ప్రో ప్లస్' (Realme 11 Pro+) ఒకటి. దీని ధర రూ. 27,999 మాత్రమే. ఇందులో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ వంటివాటితో పాటు ముందు వైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫీచర్స్ చాలా ఆధునికంగా ఉంటాయి.

మోటోరోలా ఎడ్జ్ 40..
మన జాబితాలో రెండవ స్మార్ట్​ఫోన్ 'మోటోరోలా ఎడ్జ్ 40' (Motorola Edge 40). దీని ధర రూ. 29,999. ఈ మొబైల్ 144 Hz రిఫ్రెష్ రేటుతో 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్​డీ డిస్​ప్లే పొందుతుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 13 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ ఉంటాయి. ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ సెంటర్డ్ పంచ్-హోల్ కెమెరా ఉంది. 4400 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 68 వాట్స్ వైర్డ్, 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 3..
రూ. 33,999 వద్ద లభించే 'వన్‌ప్లస్ నార్డ్ 3' (OnePlus Nord 3) స్మార్ట్​ఫోన్ ఆధునిక ఫీచర్స్ అయిన సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అండ్ అలర్ట్ స్లైడర్ ఉన్నాయి. 120 Hz రేటుతో 6.74 ఇంచెస్ ఫుల్లీ హెచ్​డీ డిస్​ప్లే కలిగి వెనుక వైపు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్లను పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 80 వాట్స్ పాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

(ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!)

పోకో ఎఫ్5..
మన జాబితాలో రూ. 29,999 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్​ఫోన్​ 'పోకో ఎఫ్5' (Poco F5). ఇది 120 Hz 6.67 ఇంచెస్ హెచ్​డీ డిస్​ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సర్లతో పాటు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా పొందుతుంది. డిజైన్ & ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉంటుంది.

(ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో హైదరాబాద్ ఎక్కడుందంటే?)

ఐక్యూ నియో 7 ప్రో ( iQOO Neo7 Pro)..
రూ. 34,999 వద్ద లభించే ఈ ఐక్యూ నియో 7 ప్రో ఇప్పుడు ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న మొబైల్. ఇది అండర్-స్క్రీన్ బయోమెట్రిక్ రీడర్‌ కలిగి 6.78 ఇంచెస్ హెచ్​డీ డిస్​ప్లే పొందుతుంది. ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వెనుక వైపు 50 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా పొందుతుంది.

Advertisement
Advertisement