వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్లు .. తెలిస్తే ఫుల్ ఖుషీ అవ్వాల్సిందే! | Whatsapp Working On Secret Code Creation Feature For Locked Chats On Android, Know How It Works - Sakshi
Sakshi News home page

WhatsApp Secret Code Feature: వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్లు .. ఇంతకీ అవేంటో తెలుసా?

Published Mon, Oct 9 2023 3:30 PM

Whatsapp Working On Secret Code Feature For Privacy - Sakshi

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇప్పటికే వినియోగదారులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్న వాట్సాప్‌ తాజాగా సీక్రెట్‌ కోడ్‌తో పాటు ఇతర ఫీచర్‌లను విడుదల చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ కొత్త ఫీచర్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసా?  

వాట్సాప్‌ త్వరలో సీక్రెట్‌ కోడ్‌ ఫీచర్‌, సెర్చ్‌ ఫీచర్‌ ఫర్‌ అప్‌డేట్‌ ట్యాబ్‌, పిన్న్‌డ్‌ మెసేజెస్‌,రీడైజన్‌చాట్‌, ఐపీ ప్రైవసీ ఫీచర్లపై పనిచేస్తుంది. మరికొద్ది రోజుల్లో సీక్రెట్‌ కోడ్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మిగిలిన ఫీచర్లు అప్‌డేట్‌ కానున్నాయి. వాట్సాప్‌ అప్‌డేట్‌లను అందిచే వీబీటా ఇన్ఫో తాజాగా ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌లోని ఐదు ఫీచర్ల వివరాల్ని వెలుగులోకి తెచ్చింది. 

సీక్రెట్‌ కోడ్‌ ఫీచర్‌ 
ఫోన్‌లో మెయిన్‌ పాస్‌వర్డ్‌ ఎలా ఉందో.. ఇప్పుడు వాట్సాప్‌లోని చాట్‌లకు పిన్‌, బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ను అందుబాటులోకి తేనుంది. తద్వారా, ఫోన్‌లో మీరు చేసిన పర్సనల్‌ చాటింగ్‌, ఫోటోలు, వీడియోలు ఇతరులు చూసే వీలుండదు. అంతేకాదు, మీరు లాక్‌ చేసిన ఆ చాటింగ్‌ సమాచారం అంతా సపరేట్‌ సెక్షన్‌లో కనిపించనుంది. ఒకవేళ అగంతకులు ఆ చాట్‌ను ఓపెన్‌ చేసి చూడాలంటే మీరు ఎంటర్‌ చేసిన పిన్‌ లేదంటే బయో మెట్రిక్‌ అథంటికేషన్‌ ఇవాల్సి ఉంటుంది. 

సెర్చ్‌ ఫీచర్
ఈ ఫీచర్‌ ఇప్పటికే ఎంపిక చేసిన యూజర్లు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. తర్వలోనే అందరికి అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ సాయంతో మీరు ఫాలో అయ్యే వాట్సాప్‌ ఛానెల్స్‌, వెరిఫైడ్‌ చానెల్స్‌లో ఎవరెవరు ఏం స్టేటస్‌ పెట్టారో సెర్చ్‌ బటన్‌ ఫీచర్‌లో​ పేరు ఎంటర్‌ చేసి తెలుసుకోవచ్చు.

పిన్న్‌డ్‌ మెసేజెస్‌
పిన్న్‌డ్‌ మెసేజెస్‌ ఈ ఫీచర్‌తో సాయంతో ముఖ్యమైన మెసేజ్‌లను చాట్‌ కన్వర్షన్‌లో మీకు కనపడేలా పిన్‌ చేయొచ్చు. 

రీడిజైన్‌ చాట్‌ అటాచ్‌మెంట్‌ 
ఈ రీడిజైన్‌ చాట్‌ అటాచ్‌మెంట్‌ అప్‌డేట్‌తో వాట్సాప్‌ ఫ్రెష్‌లుక్‌తో కనిపించనుంది. వాట్సాప్‌లో వీడియో, కంటెంట్‌, ఆడియో ఫైల్స్‌ షేరింగ్‌ చేసే విధానం మారనుంది. 

ఐపీ అడ‍్రస్‌ను కనిపెట్టలేరు 
అగంతకులు మీ వాట్సాప్‌ ఐపీ అడ్రస్‌ ఏంటనేది కనిపెట్టలేరు. యూజర్ల సాధారణంగా ఐపీ అడ్రస్‌తో వాట్సాప్‌లో మనం చేసే వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌, ఇతర వివరాల్ని సేకరించవచ్చు. అయితే తాజాగా అప్‌డేట్‌తో ఐపీ అడ్రస్‌ గుర్తించలేని విధంగా సెక్యూరిటీ ఫీచర్‌ను అప్‌డేట్‌ చేయనుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement