కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్? | Korutla Deepti Death Case: Key Points In Post Mortem Report - Sakshi
Sakshi News home page

కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్?

Published Thu, Aug 31 2023 9:53 AM

Korutla Deepti Death Case: Key Points In Post Mortem Report - Sakshi

సాక్షి, జగిత్యాల జిల్లా: సంచలనం సృష్టించిన కోరుట్ల దీప్తి మృతి కేసులో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కీలకం కానుంది. ఈ రోజు  వైద్యులు ఇచ్చే పోస్ట్‌మార్టం నివేదికలో మరిన్ని విషయాలు బయటకురానున్నాయి. మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలిసింది. దీప్తి చెల్లె చందన, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఆ రాత్రి ఇంట్లో మద్యం పార్టీ అనంతరం వెళ్లిపోవడంతో పలు అనుమానాలు నెలకొన్నాయి.

చందన తాను అక్కను చంపలేదని తమ్ముడు సాయికి వాయిస్‌ మేసేజ్‌ పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చందన ఆడియో కాల్స్‌పై పోలీసులు క్రాస్ చెక్‌ చేస్తున్నారు. అలాగే నిన్న అంతా హైలెట్‌ అయిన  కోరుట్ల బస్టాండ్‌లో సీసీ కెమెరా ఫుటేజ్ చందన, ఆమె బాయ్ ఫ్రెండ్‌ది కాదని పోలీసులు తేల్చారు.

చందన వాయిస్‌ మెసేజ్‌ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. కోరుట్ల బస్టాండ్‌లో మంగళవారం ఉదయం కనిపించిన సీసీ ఫుటేజీ చిత్రాలు.. చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌వి కావనే సమాచారంతో విచారణ గందరగోళంగా మారింది. అయితే, చందన బాయ్‌ ఫ్రెండ్‌ కారులో వచ్చి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఆమె వాయిస్‌ మేసేజ్‌ వచ్చిన సెల్‌ఫోన్‌ ఆధారంగా రెండు బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని గాలింపు చేపట్టాయి.
చదవండి: నా తప్పేం లేదు.. నాకు అక్కను చంపే ఉద్దేశమే లేదు..

బంక శ్రీనివాస్‌రెడ్డి(దీప్తి తండ్రి) ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, సుమారు 50 తులాల వరకు బంగారు ఆభరణాలు మాయమైనట్లు సమాచారం. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన చందన.. డబ్బులు తాను తీసుకున్నట్లు వాయిస్‌ మేసేజ్‌లో చెప్పినా.. బంగారం విషయం ఎత్తలేదు. బంగారం సైతం చందన తీసుకెళ్లి ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చందన తన క్లాస్‌మేట్‌ ఒకరితో కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటోందని, అతడితో కలిసి డబ్బులు, నగలు తీసుకు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement