Beauty Tips: పసుపుతో పింక్‌ లిప్స్‌.. | Sakshi
Sakshi News home page

Beauty Tips: పసుపుతో పింక్‌ లిప్స్‌..

Published Fri, Apr 19 2024 11:03 AM

Beauty Tips: Try This To Get Relief From These Health Problems - Sakshi

ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాగానీ, కొన్ని సమస్యలు మనకు తెలియకుండానే పెద్ద తలనొప్పిగా మారుతాయి. వాటినుంచి ఎలా తప్పుకొవాల్లో కూడా తెలీక ఇబ్బంది పడుతుంటాం. మరి ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించాలంటే ఇలా ప్రయత్నం చేసి చూడండి..

ఇలా చేయండి..

  • పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. రోజూ రాత్రిపూట క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పెదవులు గులాబి రంగులోకి మారతాయి.
  • చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల పెదవులపై ఏర్పడిన మచ్చలు పోతాయి.
  • హెయిర్‌ కలర్‌గానీ హెన్నాగానీ జుట్టుకు పెట్టే ముందుకు చెవులు, నుదురుకు పెట్రోలియం జెల్లిని రాయాలి. తరువాత హెన్నా పెట్టుకోవాలి. చెవులు, నుదురు ్రపాంతంలో హెన్నా పడ్డప్పటికీ నీటితో కడిగితే ఇట్టే పోతుంది.
  • పెట్రోలియం జెల్లి లానే ఆలివ్‌ ఆయిల్‌ను కూడా డైకు ముందు చెవులు, నుదురు, మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. తరువాత డై పడినా నీటితో కడిగితే పోతుంది.

ఇవి చదవండి: Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!

Advertisement
Advertisement