కే బ్యూటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌ కూతురు! | Sakshi
Sakshi News home page

కే బ్యూటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌ కూతురు!

Published Fri, May 3 2024 12:50 PM

Sara Tendulkar Is Announced As K Beauty Brand Laneiges Ambassador

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయ సారా టెండూల్కర్‌ స్టన్నింగ్‌ లుక్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సార్‌ గ్లాస్‌లాంటి స్కిన్‌తో అత్యంత అందంగా ఉంటుంది. ఇప్పటికే ఆమె 2021లో అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్‌ సెల్ఫ్‌ పోర్ట్రెయిట్‌ ప్రకటనల్లో కనిపించి మోడలింగ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడూ గ్లామర్‌ రంగంలో ఎంట్రీ ఇస్తూ..ప్రఖ్యాత భారతీయ కొరియన్‌ స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ లానీజ్‌ అంబాసిడర్‌గా వ్యవవహరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

సారా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్‌ చేస్తూ..ఆరోగ్యకరమైన మెరస్తున్న చర్మం కోసం లానీజ్‌ బ్రాండ్‌ని ఎంపిక చేసుకుని సరికొత్త ముఖంతో థ్రిల్‌గా ఉన్నాను. మీరు కూడా నాలాగే ప్రకాశవంతమైన చర్మంతో ఉండటానికి సిద్ధంగా ఉండండి అంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. తాను ఆ బ్రాండ్ ఆవిష్కరణ, నిబద్ధతను అభినందిస్తున్నాని చెప్పింది. 

తాను కొంతకాలంగా ఈ ఉత్పత్తులను వినయోగిస్తున్నట్లు తెలిపింది. ప్రతి వ్యక్తి కాంతివంతంగా ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. తాను ఈ లానీజ్‌తో మరింత అందంగా కనిపించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అని రాసుకొచ్చింది సారా. సారా గ్లామర్‌ పరంగా సింపుల్‌ మేకప్‌తో క్యూట్‌ లుక్‌తో సందడి చేస్తుంది. మస్కరాతో నిండిన కనురెప్పలతో అందర్నీ ఎట్రాక్ట్‌ చేస్తుంది. పైగా అందమంతా గుది గుచ్చినట్లుగా ఉంటుంది సారా. అందుకు తగ్గట్లు ఆమె ధరించే డిజైన్‌వేర్‌లు ఆమె అందాన్ని మరింత ఇనమడింప చేస్తాయి.

 

 ( చదవండి: ఈ ఏడాది మెట్‌ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?)

 

Advertisement
 
Advertisement
 
Advertisement