మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు! | These Are The List Of Food Items That May Help To Control Diabetes, Know More Details Inside - Sakshi
Sakshi News home page

మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!

Published Mon, Nov 13 2023 5:31 PM

These Food Items That May Help To Control Diabetes - Sakshi

మధుమేహం అని భయపడొద్దు. చక్కటి చిట్కాలతో మదుమేహన్ని అదుపులో పెట్టుకోవడమే గాదు రాకుండా చూసుకోవచ్చు. అదికూడా మీకు అందుబాటులో దొరికేవి, మనం నిత్యం చూసే వాటితోనే సులభంగా డయాబెటిస్‌కి చెక్‌పెట్టోచ్చు. ముఖ్యంగా మనం వంటలో నిత్యం ఉపయోగించే సుగంధద్రవ్యాలు, ఫైబర్‌తో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశమే ఉండదంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటంటే..

మదుమేహాన్ని నియంత్రించే సుగంధ ద్రవ్యాలు..

పసుపు
భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించేది పసుపు. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా ఇన్సులిన్‌ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇది డయాబెటిక్‌కి సంబంధించిన అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. 

దాల్చిన చెక్క
దీన్ని మనం కొన్ని రకాల రెసిపీల్లో ముఖ్యంగా ఉపయోగిస్తాం. ఇది టైప్‌2 డయాబెటిస్‌ ఉన్న వారిలో కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ ఎఫెక్ట్స్‌ ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా కాపాడతాయి. 

వెల్లులి
ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రక్తపోటు, కొలస్ట్రాయల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులకు చక్కటి ఔషధం. 

లవంగాలు
ఇవి క్రిమి నాశక, క్రిమి సంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అంటు వ్యాధులను నివారించడం తోపాటు గాయాలను త్వరితగతిన నయం చేస్తాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి ఇన్సులిన్‌ పనితీరుని మెరుగుపరుస్తుంది. 

ఫైబర్‌తో కూడిన ఆహారపదార్థాలంటే..

బీన్స్, బఠానీలు 
వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒక కప్పు బీన్స్, బఠానీళ్లలో సుమారు 
15 గ్రాముల ప్రోటీన్, 15గ్రాముల ఫైబర్ ఉంటుంది.

నట్స్‌, గుమ్మడి లేదా పుచ్చకాయ విత్తనాలు
వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ,ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సలాడ్లు, వోట్‌మీల్‌, పెరుగు వంటి వాటిలో కూడా చేర్చుకుని తినొచ్చు. వీటిలో సుమారు 5 నుంచి 10 గ్రాములు ప్రోటీన్‌,  మూడు నుంచి 5 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. 

సోయా లేదా గోధుమ ఆధారిత ఉత్పత్తులు
మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించొచ్చు. వీటిలో 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్‌, రెండు నుంచి 5 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. 

క్వినోవా, వోట్స్, బార్లీ మరియు ఇతర తృణధాన్యాలు
ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు. వీటిలో ప్రోటీన్, ఫైబర్‌ల తోపాటు వివిధ ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఒక కప్పు వండిన క్వినోవా, ఓట్స్, బార్లీ లేదా ఇతర తృణధాన్యాల్లో సుమారు 6 నుంచి 10 గ్రాముల ప్రోటీన్, 4 నుంచి 8 గ్రాముల ఫైబర్లు ఉంటాయి. 

ఇలాంటి ప్రోటీన్లు, ఫైబర్లతో కూడిన పదార్థాలు, సుగంధ ద్రవ్యాలను డయాబెటిస్‌ రోగుల తమ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు, ప్రోటీన్లు అందడమే గాక జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ సమృద్ధిగా పెరిగి ఎటువంటి రుగ్మతలు దరిదాపుల్లోకి రావు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

(చదవండి: మదుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్‌ స్థాయిలు పెరగకూడదంటే..)

Advertisement
Advertisement