జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ | Sakshi
Sakshi News home page

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Published Mon, Jan 1 2024 1:30 PM

Earthquake Hits Japan Tsunami Warning Issued - Sakshi

టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికల్ని జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయని వెల్లడించింది. ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 

భూకంప ప్రభావంతో సముద్ర అలలు తీరం వైపు దూసుకొస్తున్నాయి. సునామీ అలలతో నోటో, ఇషికావా జపాన్‌లో నదిలో అలలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్నాయి. సునామీ వచ్చే అవకాశం ఉండటంతో జపాన్ పశ్చిమ తీరంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భూకంప దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. భూప్రకంపనలతో స్టోర్‌లోని వస్తువులు చెల్లాచెదురవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూకంపానికి సంబందించి ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు విడుదల చేయలేదు. హొకురీకు అణు విద్యుత్ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగాయా? అని అధికారులు తనిఖీ చేస్తున్నారు. 

మార్చి 11, 2011న, జపాన్‌లోని హోన్షు ద్వీపం ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్  చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. భయంకరమైన సునామీ ఏర్పడటానికి కారణమైంది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా మరణించారు. ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్‌లో అణు అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి: Happy New Year: 2024.. దునియాలో కొత్తగా జరగనుంది?

Advertisement
 
Advertisement
 
Advertisement