Sakshi News home page

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణం: ఎన్నికల వేళ చిక్కుల్లో ట్రంప్‌

Published Mon, Feb 19 2024 9:32 AM

Putin Wing In Republicans Warned Same Party Leader - Sakshi

వాషింగ్టన్‌: రష్యా ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై కరడుగట్టిన విమర్శకుడిగా పేరొందిన అలెక్సీ నావల్నీ మృతి.. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. నావల్నీ మృతిపై.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సరిగా స్పందించలేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

రిపబ్లికన్‌ పార్టీలో పుతిన్‌ వింగ్‌ (పుతిన్‌ అనుకూల వర్గం) పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్రంప్‌ను ఉద్దేశించి ఆ పార్టీ నేత లిజ్‌ చెనే హెచ్చరించారు. అలాంటివారిని వైట్‌హౌజ్‌లోకి వెళ్లనివ్వకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ‘రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై డొనాల్డ్‌ ట్రంప్‌ సరైన రీతిలో స్పందించలేదు. చట్టానికి అతీతులుగా వ్యవహరించడంలో ట్రంప్‌, పుతిన్‌లు ఇద్దరూ ఇద్దరే. నాటో దేశాలపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమెరికా, బ్రిటన్‌ల భద్రతను ప్రమాదంలో పడేస్తాయి’అని చెనే తెలిపారు.

కాగా, నాటో మార్గదర్శకాల ప్రకారం ఖర్చు పెట్టని దేశాలను రష్యా ఏమైనా చేసుకోవచ్చని.. ఈ విషయంలో రష్యాను తాను ప్రోత్సహిస్తానని ఇటీవల ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 

ఇదీ చదవండి.. సొంత బ్రాండ్‌ షూస్‌ విడుదల చేసిన ట్రంప్‌ 

Advertisement
Advertisement