Sakshi News home page

వారసుడికి విజయం దక్కేనా ?

Published Sat, Apr 20 2024 1:40 AM

- - Sakshi

లక్షల్లో

మైసూరు: దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మైసూరు పేరు సుపరిచితం. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఈ నగరంలో ఇంకా రాచరికపు పోకడలు దర్శనమిస్తాయి. దసరా వేడుకలకు లక్షల మంది పర్యాటకులు దసరా వైభవం చూడటానికి తరలివస్తుంటారు. ఇప్పుడు మరోసారి యావత్‌ ప్రజలు మైసూరు రాజప్రాసాదం వైపు చూస్తున్నారు. ఎందుకంటే మైసూరు రాజ వంశానికి చెందిన యువరాజు కృష్ణదత్త చామరాజ ఒడెయార్‌ ఇప్పుడు ఎన్నికల బరిలో ఉండటమే కారణం. ఈ ఎన్నికల్లో బీజేపీ–జేడీఎస్‌ ఉమ్మడి అభ్యర్థిగా మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్‌ బరిలో ఉన్నారు. దీంతో అనేక మంది యదువీర్‌ విజయం నల్లేరుమీద నడకే అన్నట్లు ఉండగా, మరికొంత మంది సీఎం సిద్దరామయ్య సొంత జిల్లా, అది కూడా గతంలో కాంగ్రెస్‌ కంచుకోటలో విజయం అంత సులభంగా దక్కదని చెబుతున్నారు.

ఎన్నికల్లో మళ్లీ వారసుడు :

మరోవైపు మూడు దశాబ్ధాల అనంతరం మైసూరు రాజ వంశానికి చెందిన వారసుడు యదువీర్‌ రాజకీయ రంగంలోకి దిగారు. అంతకు ముందు యదువీర్‌ తండ్రి శ్రీకంఠ దత్త నరసింహరాజ ఒడయర్‌ కాంగ్రెస్‌ నుంచి నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. అనంతరం టికెట్‌ రాకపోవడంతో బీజేపీలో చేరి పోటీ చేసి పరాజయం పొందారు. తాజాగా ఆయన దత్త కుమారుడు యదువీర్‌ బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం ఉత్కంఠ రేపుతోంది.

కాంగ్రెస్‌ కంచుకోట

మైసూరు–కొడగు పార్లమెంట్‌ గతంలో కాంగ్రెస్‌ పారీ

్టకి కంచుకోట, ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ 14సార్లు విజయం సాధించగా బీజేపీ కేవలం నాలుగుసార్లు గెలిచింది. జేడీఎస్‌ ఖాతా కూడా తెరవలేదు. గడచిన పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కంటే బీజేపీ బలోపేతమైంది. యువ నాయకుడు ప్రతాప్‌ సింహ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన్ను పక్కన పెట్టి యదువీర్‌ను బరిలోకి దించారు.

విజయం కోసం కాంగ్రెస్‌ వ్యూహాలు :

సీఎం సిద్దరామయ్య సొంత జిల్లా కావడంతో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించడానికి అన్ని దారులు వెతుకుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మణ్‌ తొమ్మిదిసార్లు ప్రచారం కూడా పూర్తి చేశారు. మరోవైపు జేడీఎస్‌ సైతం మైసూరులో సిద్దరామయ్యకు ఓటమి రుచి చూపించాలని పట్టుదలతో ఉంది. ఇక వక్కలిగ సముదాయానికి చెందిన అభ్యర్థి లక్ష్మణ్‌కు సీఎం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ ఒక్కలిగ ఓట్లను నమ్ముకొని ముందుకు సాగుతోంది.

రాచనగరి రాజప్రాసాదం వైపే

అందరి చూపు

మైసూరు–కొడగు పార్లమెంట్‌

అభ్యర్థిగా యదువీర్‌

కాంగ్రెస్‌ అభ్యర్థిగా లక్ష్మణ్‌

సొంత జిల్లాలో సీఎంకు కఠిన పరీక్ష

గెలుపుపై ఇరుపార్టీల గురి

కులాల వారీగా ఓటర్లు

ఒక్కలిగలు : 5.50

దళితులు : 3.20

ముస్లింలు : 2.0

కురబలు : 2.30

లింగాయత్‌లు 1.90

బ్రాహ్మణులు : 1.40

కొడవలు : 1.10

నాయక్‌లు : 2.0

ఇతరులు : 1.50

Advertisement

తప్పక చదవండి

Advertisement