13 ఏళ్ల‌కే ‘అత్యంత మేధావి’గా.. తెలంగాణ కొత్త‌గూడెం మిస్‌ టీన్‌! | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల‌కే ‘అత్యంత మేధావి’గా.. తెలంగాణ కొత్త‌గూడెం మిస్‌ టీన్‌!

Published Tue, Dec 19 2023 12:12 AM

- - Sakshi

ఖమ్మం/కొత్తగూడెం: అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న సియాటల్‌ నగరంలో ఈనెల 16న ‘సామాజిక విద్యాపరమైన సమతుల్యత’ అంశంపై జరిగిన ఈవెంట్‌లో కొత్తగూడేనికి చెందిన పదమూడేళ్ల బాలిక అవ్యుక్త గెల్లా ప్రతిభ కనబరిచి అత్యంత మేధావి అవార్డుకు ఎంపికైంది. అమెరికాలో ఉంటున్న గెల్లా గణేష్‌ – రాధిక కుమార్తె అవ్యుక్తతో పాటు 13 ఏళ్ల నుండి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 30 మంది ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్‌ టీన్‌ విభాగంలో అవ్యుక్త పలు అంశాలపై తన ప్రసంగంతో ఆకట్టుకోగా అవార్డుకు ఎంపిక చేశారు. ఈమేరకు ఆమె తాతయ్య, అమ్మమ్మ అయిన కొత్తగూడేనికి చెందిన వసుంధర వస్త్ర దుకాణం యజమానులు తాటిపల్లి శంకర్‌బాబు – రాజేశ్వరి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి చ‌ద‌వండి: ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది!

Advertisement
Advertisement