చంద్రమోహన్ దశాబ్దాల సినీ జీవితం.. ఆయనకిష్టమైన పాటలు ఇవే! | Sakshi
Sakshi News home page

Chandra Mohan: చంద్రమోహన్ దశాబ్దాల సినీ జీవితం.. ఆయనకిష్టమైన పాటలు ఇవే!

Published Sat, Nov 11 2023 2:08 PM

Chandra Mohan Likes Super Hit Songs His Tollywood Movies In Career - Sakshi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే సినీ దిగ్గజం నింగికెగిసింది. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తన కెరీర్‌లో హీరోగా, విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన తీరు తెలుగువారికి చిరకాలం గుర్తుండిపోతాయి. తన సినీ జీవితంలో  దాదాపు 932 చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రంగుల రాట్నంతో మొదలైన ఆయన సనీ ప్రస్థానం.. గోపిచంద్ చిత్రం ఆక్సిజన్‌తో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ ‍హిట్స్ ఉన్నాయి. అలా ఆయన నటించిన చిత్రాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమాల్లో ఆయనకు ఇష్టమైన టాప్ హిట్ సాంగ్స్ గురించి వివరాలు పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం.  

(ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్‌, చివరి దశలో సింపుల్‌గా..)
 

చంద్రమోహన్‌కు ఇష్టమైన 30 పాటలు.

  •  ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ
  •  మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి 
  •   మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు
  •   కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం
  •  మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ
  •  లేత చలిగాలులు– మూడు ముళ్లు
  •  దాసోహం దాసోహం – పెళ్లి చూపులు 
  • సామజవరాగమనా – శంకరాభరణం
  •  ఈ తరుణము – ఇంటింటి రామాయణం 
  • ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి  
  • పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు
  •  నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి  
  • పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి
  •  కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం 
  •  ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే 
  •  బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం 
  •  నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు 
  •  చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు 
  •   నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం 
  •  వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం  
  •  అటు గంటల మోతల – బాంధవ్యాలు  
  • ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు  
  • ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య  
  • ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం  
  • ఏమని పిలవాలి – భువనేశ్వరి  
  • మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు  
  • పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి  
  • ఐ లవ్‌ యు సుజాత– గోపాల్‌ రావ్‌ గారి అమ్మాయి 
  • నీ తీయని పెదవులు– కాంచనగంగ 
  • నీ చూపులు గారడీ– అమాయకురాలు

(ఇది చదవండి: నటుడు చంద్రమోహన్‌ మృతికి కారణాలివే!)  

వ్యక్తిగత జీవితం..

చంద్రమోహన్ భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే.  వీరికి ఇద్దరమ్మాయిలు సంతాన కాగా.. వారికి పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌. ఆమె భర్త బ్రహ్మ అశోక్‌ ఫార్మాసిస్ట్‌ కాగా అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే కావడంతో వీరంతా చెన్నైలో ఉంటున్నారు. 


 

Advertisement
Advertisement