దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 22,778కు చేరింది. సెన్సెక్స్ 430 పాయింట్లు ఎగబాకి 75,050 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ సూచీలు ఆల్‌టైమ్‌హైలో ట్రేడవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని అంచనాలు వస్తున్నాయి. దాంతో సూచీలు రికార్డుస్థాయిలో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 83.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.91 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.51 శాతం ఎగబాకింది.
ఏప్రిల్ నెలలో జీఎస్‌టీ వసూళ్లు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. తయారీ సానుకూల గణాంకాలను విడుదల చేసింది. వీటి మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా ఆరో సమావేశంలో కీలక వడ్డీరేట్లను 5.25-5.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ద్రవ్యోల్బణం రెండు శాతం చేరేంత వరకు వడ్డీరేట్లలో మార్పులు చేయడం సరికాదని భావిస్తున్నట్లు చెప్పారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment