దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 22,459కు చేరింది. సెన్సెక్స్ 6 పాయింట్లు పెరిగి 73,896 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 83.37 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.03 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.19 శాతం ఎగబాకింది.
బీఎస్‌ఈ మిడ్, స్మాల్ సూచీలు సోమవారం 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్‌బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment