దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 22,542కు చేరింది. సెన్సెక్స్ 227 పాయింట్లు ఎగబాకి 74,097 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.08 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.91 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.99 శాతం ఎగబాకింది.
అమెరికా జాబ్స్ డేటా ముందుగా అనుకున్న దానికంటే తక్కువగా నమోదైంది. మార్కెట్ 2.4లక్షల ఉద్యోగాలు కొత్తగా చేరుతాయని భావించింది. కానీ 1.75లక్షల ఉద్యోగాలు నమోదయ్యాయి. నిరుద్యోగిత రేటు 3.9 శాతంగా ఉంది. యూఎస్ 2 ఏళ్ల ఈల్డ్ 10 పాయింట్లు తగ్గింది. శుక్రవారం ఎఫ్‌ఐఐలు రూ.2392 కోట్లు విలువచేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ.691 కోట్లు విలువచేసే షేర్లు కొనుగోలు చేశారు. ఫ్యూచర్ ఇండెక్స్‌లో 44 శాతం లాంగ్ పొజిషన్లు, 56 శాతం షార్ట్ పొజిషన్లు నమోదయ్యాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment