కేంద్రం ప్రతిపాదన మేరకే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు రూపకల్పన
యజమానులకు పక్కాగా భూ హక్కులు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం
గ్రామసభలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అమలు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
విశాఖ సిటీ: ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రిజి్రస్టేషన్ తర్వాత జిరాక్స్ కాపీ ఇస్తారనడం... తెల్లకాగితం మీద రిజి్రస్టేషన్ చేస్తారనడం పూర్తిగా అవాస్తవాలు. కేంద్రం రూపొందించిన ముసాయిదా ప్రకారం మన రాష్ట్రంలోని ఏ ఒక్కరి ప్రయోజనాలకు భంగం కలగకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రూపొందించాం. అందరి ఆమోదం తర్వాతే అమలుచేస్తాం. చంద్రబాబు మాయమాటలను ఎవరూ నమ్మవద్దు’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన గురువారం విశాఖ లాసెన్స్‌బే కాలనీలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కేంద్రం ప్రతిపాదనతోనే...
‘దేశంలో సమగ్రమైన రిజి్రస్టేషన్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా తయారుచేసింది. దానిప్రకారం మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే ఏపీ కూడా కేంద్రం ఇచ్చిన ముసాయిదాకు తుది మెరుగులు దిద్ది రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు రూపొందించింది. రిజి్రస్టేషన్‌శాఖలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నాం.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అసెంబ్లీలో మూడుస్లార్లు చర్చ జరిగింది. కేంద్రానికి పంపిన తర్వాత వారి సందేహాలను నివృత్తి చేశాం. ప్రస్తుతం ఈ యాక్ట్ కోర్టు పరిధిలో ఉంది. ఈ చట్టాన్ని అమలుచేసే ముందు సమగ్ర భూసర్వే పూర్తయిన ప్రతి గ్రామంలో మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపడతాం. ఆ గ్రామంలో మొత్తం భూముల వివరాలు, వ్యక్తిగత, ప్రభుత్వ భూములు, వాటి హద్దులు.. ఇలా అన్నింటినీ ప్రజల ముందు పెడతాం.
ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వాటన్నింటినీ సరిచేసిన తర్వాత వారి ఆమోదంతోనే ఆ గ్రామాన్ని చట్టం పరిధిలోకి తీసుకువస్తాం. ప్రజాభిప్రాయం సేకరించకుండా ఈ చట్టాన్ని అమలుచేయబోం. ఈ చట్టం ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. లిటిగెంట్లకు, దళారులకు మాత్రమే ఈ చట్టం కారణంగా నష్టం కలుగుతుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. ప్రజల ఆస్తికి ప్రభుత్వం జవాబుదారీ.’ అని మంత్రి బొత్స చెప్పారు.
చంద్రబాబుకు దేవుడు ఆ అవకాశమివ్వడు
‘ఆలూ లేదు.. చూలులేదు అన్న సామెతలా ఉంది చంద్రబాబు పరిస్థితి. చట్టం అమల్లోకే రాలేదు. అయినా ఆయన అధికారంలోకి వచి్చన వెంటనే దానిని రద్దు చేస్తానని చెబుతున్నాడు. రద్దు చేయడానికి ఆ చట్టంలో ఉన్న తప్పేంటో చెప్పగలడా? అయినా చంద్రబాబుకు దేవుడు ఆ అవకాశం ఇవ్వడు. పచ్చ మీడియా కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అసత్య ప్రచారంచేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పిచ్చి ప్రయత్నాలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ తర్వాత జిరాక్సు కాపీలు ఇస్తారని ఎవడు చెప్పాడు రామోజీకి? ఎన్నికలు జరుగుతున్నాయి.. లేదంటే ఇలాంటి తప్పుడు రాతలు రాసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నందుకు ఎల్లో మీడియాపై చర్యలు తీసుకునేవాళ్లం.’ అని మంత్రి బొత్స చెప్పారు.
మోదీ బొమ్మ ఎందుకు లేదు?
‘బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పుడు మేనిఫెస్టోలో మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, ఎనీ్టఆర్ బొమ్మలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఇద్దరు ఏమయ్యారు? కూటమిలోని పార్టీయే మీ మేనిఫెస్టోను అంగీకరించనప్పుడు ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు చంద్రబాబు? దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
ఆయన 2019, 2024లో తీసుకొచ్చిన మేనిఫెస్టోలు దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. 2014లో చంద్రబాబు 50పేజీల మేనిఫెస్టో ప్రింట్ చేశాడు. ఇప్పుడు ఐదు పేజీలకు దిగివచ్చాడు. ఈ కూటమి ముఠా... జగన్ మేనిఫెస్టోలోని అంశాలనే కాదు.. పేజీల సంఖ్యను సైతం కాపీ కొట్టింది.’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment