Dhanush and Arun Matheswaran combination is going to be repeated - Sakshi
Sakshi News home page

ఆ దర్శకుడితో ధనుష్ మరో సినిమా

Published Mon, Aug 21 2023 12:34 AM

Dhanush and Arun combination is going to be repeated - Sakshi

హీరో ధనుష్, దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్  కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘కెప్టెన్  మిల్లర్‌’. ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. అయితే ‘కెప్టెన్  మిల్లర్‌’ తర్వాత అరుణ్‌ మాథేశ్వరన్  దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నారు ధనుష్‌.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ఇలా ధనుష్, అరుణ్‌ కాంబినేషన్  రిపీట్‌ కానుంది. అలాగే ఈ సినిమాకు ధనుష్‌ నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కెరీర్‌లోని 50వ సినిమాతో బిజీగా ఉన్నారు ధనుష్‌. ఈ మూవీలో ఆయన హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌ ఇప్పటికే కమిట్‌ అయిన  సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే అరుణ్‌ సినిమాని స్టార్ట్‌ చేస్తారట. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement