‘ఆయనేమైనా నేరస్థుడా? గ్యాంగ్‌స్టరా?’.. కోర్టులో కేజ్రీవాల్‌ తరుపు న్యాయవాది | Sakshi
Sakshi News home page

ఈడీ తీరు హాస్యాస్పదం.. ‘ఆయనేమైనా నేరస్థుడా? గ్యాంగ్‌స్టరా?’ కోర్టులో కేజ్రీవాల్‌ తరుపు న్యాయవాది

Published Fri, Apr 19 2024 4:48 PM

Arvind Kejriwal Lawyer Denies Jail Diet Allegations By Ed - Sakshi

న్యూఢిల్లీ : తనకు తీహార్‌ జైల్లోనైనా డయాబెటీస్‌ ఇన్సులిన్‌ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజ్వర్‌లో ఉంచింది. ఏప్రిల్‌ 22న తీర్పును వెలువరించనుంది. 

మద్యం పాలసీ కేసులో తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ గత కొన్నేళ్లుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ పడిపోతున్నాయని, ట్రీట్మెంట్‌ తీసుకునేందుకు వైద్యుల వీడియో కన్సల్టేషన్‌ కావాలని ఇప్పటికే పలు మార్లు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వచ్చింది. 

కేజ్రీవాల్‌పై కుట్ర
అయితే కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు,ఆప్‌ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సులిన్‌ ఇవ్వకుండా కేజ్రీవాల్‌ను చంపేందుకు జైల్లో కుట్రజరుగుతోందని ఆప్‌ నేత అతిషి సంచలన ఆరోపణలు చేస్తున్నారు.  

కోర్టులో కేజ్రీవాల్‌ మరో పిటిషన్‌
ఈ తరుణంలో తనకు ఇన్సులిన్‌ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్‌ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ తరుపు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈడీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. 

ఈడీ ఆరోపణల్ని తోసుపుచ్చిన న్యాయవాది
కేజ్రీవాల్ జైలులో కేవలం మూడుసార్లు మామిడి పండ్లను తిన్నారని, నవరాత్రి ప్రసాదంగా ఆలూ పూరీని సేవించారని కోర్టుకు తెలిపారు. మెడికల్‌ బెయిల్‌ పొందేందుకు ఆప్ అధినేత హై షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలను తోసిపుచ్చారు.  

మూడు మామిడి పండ్లే తిన్నది
కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఇన్సులిన్ వేసుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్థనపై సింఘ్వీ కోర్టులో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ ఇప్పటి వరకు 48 సార్లు ఇంటి నుంచి పంపిన భోజనం చేశారు. గ్లైసెమిక్ ఇండెక్స్ వ్యాల్యూ ఆధారంగా మూడు మామిడి పండ్లను మాత్రమే తిన్నారు. మామిడి (51) ,వైట్ రైస్ (73) లేదా బ్రౌన్ రైస్ (68) కంటే తక్కువగా ఉంది అని సింఘ్వీ కోర్టులో వాదించారు.

కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న స్వీట్లను తింటున్నారన్న ఈడీ ఆరోపణలపై సంఘ్వీ స్పందించారు. సీఎం ఆరుసార్లు షుగర్ లేని స్వీట్లు తిన్నారని, షుగర్ లేకుండా టీ తాగేవారని, షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లను వాడారని ఆయన అన్నారు.
 
హాస్యాస్పందంగా ఈడీ తీరు
మామిడి పండ్లు తిని మెడికల్‌ బెయిల్‌ తీసుకునేందుకు కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నాంటూ ఈడీ చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని సింగ్వీ అన్నారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ నేరస్థుడా? గ్యాంగ్‌స్టరా? సంఘ్వీ ప్రశ్నించారు. ఆయన ఇప్పటి వరకు 15 నిమిషాల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యుల సాయంతో ట్రీట్మెంట్‌ తీసుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. 

ఓసారి మీరే వైద్యులు కేజ్రీవాల్‌కు సూచించిన ఆహారాన్ని చూడండి. ఇందులో తియ్యని పండ్లు, లేదా ఇతర తీపి పదార్ధాల గురించి ప్రస్తావించలేదు’ అని కోర్టుకు విన్న వించుకున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఏప్రిల్‌ 22న వెలవరించనుంది.

Advertisement
Advertisement